సెల్ఫ్ డ్రైవింగ్ సైకిల్

by Shyam |   ( Updated:2021-06-20 03:42:54.0  )
సెల్ఫ్ డ్రైవింగ్ సైకిల్
X

దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరి బాల్యంలో మధుర జ్ఞాపకాలు మిగిల్చిన సాధనం ‘సైకిల్’. నడక నేర్చే సమయంలో కిందపడటం, సైకిల్ నేర్చుకునేటప్పుడు దాని పైనుంచి పడటం సర్వసాధారణం. ఎన్నిగాయాలు చేసిన, ఎన్నిసార్లు పడిపోయినా సవారీ ఆపేది లేదు, సైకిల్‌పై ఇష్టం తగ్గేది లేదు కదా! అయితే బైస్కిల్ బ్యాలెన్స్ తప్పి పడిపోయి గాయపడిన ఓ చైనా ఇంజనీర్ మరోసారి అలా జరగకుండా ‘సెల్ఫ్ బ్యాలెన్స్ సైకిల్ రూపొందించాడు.

ఇప్పటిరవకు డ్రైవర్ రహిత కార్లు, బస్సుల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా డ్రైవర్ రహిత సైకిల్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ ఇంజనీర్ జి హుయ్ జున్ సైకిల్ రైడ్ నేర్చుకునే క్రమంలో కిందపడి గాయాల పాలయ్యాడు. దాంతో తనలా ఎవరు పడిపోకూడదనే ఆలోచనతో.. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సైకిల్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగం చేసుకుంటూనే వారాంతాల్లో సైకిల్ తయారుచేయడం మొదలుపెట్టాడు. సూక్ష్మ కదలికలను సైతం పర్యవేక్షిస్తూ, ఎదురుగా అడ్డు వచ్చినా వాటిని తప్పుకుని వెళ్లేలా ఆధునాతన యాక్సిలెరోమీటర్లు, గైరోస్కోప్‌లు ఉపయోగించి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సైకిల్‌‌ను రూపొందించాడు. కేవలం నాలుగు నెలల్లోనే నిర్మించిన ఈసైకిల్‌పై రైడ్ చేస్తే కిందపడకుండా లక్ష్యా్న్ని చేరుకోవచ్చు. సైకిల్ స్టాండ్ వేయకున్నా స్థిరంగా ఉంటూ.. మూవ్ అవుతున్న సమయంలోనూ బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాదు ఆర్‌జీబీ డెప్త్ సెన్సింగ్ కెమెరా, సెన్సార్ సాయంతో ముందు వచ్చే అడ్డంకులను గుర్తిస్తుంది. దాంతోపాటు సైకిల్ దానంతట అదే మూవ్ కాగలదు. అంతేకాకుండా హుయ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ వాకింగ్ స్టిక్ కూడా రూపొందించాడు.

Advertisement

Next Story

Most Viewed