నాయిని నర్సింహరెడ్డి అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు

by Sumithra |   ( Updated:2021-04-10 01:15:22.0  )
నాయిని నర్సింహరెడ్డి అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈఎస్ఐ కుంభకోణంలో వెలుగుచూసిన అవినీతి, అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు జరుపుతున్నారు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దివంగత కార్మిక, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ బృందాలు సోదాలు జరుపుతోంది.

నాయిని నర్సింహారెడ్డి మాజీ పర్సనల్ సెక్రెటరీ ముకుంద రెడ్డి, దేవికా రాణి, ఇతర నిందితుల ఇళ్ళల్లోనూ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Next Story