- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వెంటాడుతోన్న ‘డ్రగ్స్’.. 7 గంటల పాటు ‘ముమైత్ ఖాన్’ విచారణ
దిశ, ప్రత్యేక ప్రతినిధి : టాలీవుడ్ డ్రగ్స్‌కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరికొంత మందికి సమన్లు జారీ చేసే చాన్స్ ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు సినీ నటులను మరింత సమాచారం కోసం మరోమారు విచారించే అవకాశం ఉంది. డ్రగ్ స్మగ్లర్లు, పెడ్లర్లతో పాటు ఎఫ్ క్లబ్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో గతంలో విచారించిన వారిని మళ్లీ పిలిచే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ముమైత్ ఖాన్‌తో పాటు ఇప్పటివరకు 10 మంది సినీ ప్రముఖులకు మాదకద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉన్న కెల్విన్, జి షాన్ అలీ, మహమ్మద్ వంటి వారిని విచారించారు. ముఖాముఖి, విడివిడిగా క్రాస్ ఇంటరాగేషన్ పద్ధతిలో విచారణ కొనసాగింది. గత నెల 31న ప్రారంభమైన దర్యాప్తు ఈ నెల 22న ముగియాల్సి ఉన్నది. ఇప్పటివరకు సినీ ప్రముఖులు, పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్‌సింగ్, రానా, రవితేజ, నవదీప్, నాయుడు నందు, ముమైత్ ఖాన్ విచారణకు హాజరయ్యారు. మరో ఇద్దరు తనీష్, తరుణ్ హాజరు కావాల్సి ఉంది.
7గంటలపాటు ముమైత్ ఇంటరాగేషన్..
సినీనటి ముమైత్‌ఖాన్ బుధవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు ఏడు గంటలపాటు విచారణ కొనసాగింది. మనీ లాండరింగ్ , ఫెమా నిబంధనల ఉల్లంఘన కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ స్మగ్లర్ కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలకు హాజరయ్యారా? మీరు ఎప్పుడైనా మాదకద్రవ్యాలు వినియోగించారా? మాదకద్రవ్యాలు వినియోగించే సెలబ్రెటీలతో మీకు సంబంధాలున్నాయా? తదితర అంశాలపై ముమైత్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. 2017లో ముమైత్ ఖాన్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోని సిట్ విచారణకు హాజరయ్యారు. అప్పట్లోనే స్మగ్లర్ కెల్విన్ ముఠాతో ఉన్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలపై అధికారులు ఆరా తీశారు. ఇటీవల కెల్విన్‌తో పాటు ఎఫ్ క్లబ్ మాజీ నిర్వాహకులు, సినీ నటుడు నవదీప్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ముమైత్ ఖాన్‌ను ఇంటరాగేట్ చేసినట్టు సమాచారం. ఈడీ అధికారులు ముమైత్ ఖాన్ బ్యాంకుల ద్వారా జరిపిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు.