సర్కారుది కాదు.. నా నిర్ణయమే అది: మాజీ కాగ్

by Shamantha N |
సర్కారుది కాదు.. నా నిర్ణయమే అది: మాజీ కాగ్
X

న్యూఢిల్లీ: డిఫెన్స్ రిపోర్టులను ఉద్దేశ్యపూర్వకంగానే తాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలేదని, అది పూర్తిగా తన నిర్ణయమేనని, ప్రభుత్వ ఆదేశాలేమీ లేవని శుక్రవారం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా పదవీకాలాన్ని ముగించుకున్న రాజీవ్ మెహ్రిషీ తెలిపారు.

డిఫెన్స్ రిపోర్టులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే వాషింగ్టన్‌లో నుంచి ఇస్లామాబాద్, బీజింగ్‌లనుంచీ ఎవరైనా పరిశీలించవచ్చునని అన్నారు. వాస్తవానికి ఆ రిపోర్టులు రహస్యమేమీ కావని తెలిపారు. డిఫెన్స్ రిపోర్టుల్లోని లోపాలనూ తాము ఎత్తి చూపుతామని, అంటువంటి రిపోర్టులను ఆన్‌లైన్‌లో ఉంచాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు.

తాను గతంలో హోం శాఖలో పనిచేసినప్పుడు పాకిస్తాన్ విషయమై ఒత్తిడి ఉండేదని, మనదేశంలోని రక్షణ విషయాలను సులువుగా అందరికీ అందించడం శ్రేయస్కరం కాదని అన్నారు. ఉదాహరణకు ఒకవేళ భారత్‌లో నిజంగానే పేలుడుపదార్థాల కొరత ఉన్నదని భావిస్తే, కనీసం ఆ రిపోర్టు శత్రువులకైతే చిక్కవద్దని ఆశించడంలో తప్పులేదని తెలిపారు. 2017 సెప్టెంబర్‌లో కాగ్‌గా రాజీవ్ బాధ్యతలు తీసుకోవడానికి ముందు వరకే డిఫెన్స్ రిపోర్టులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అయ్యాయి.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed