నాటువైద్యుల ప్రచారం.. అంతరించిపోతున్న గబ్బిలాలు

by Sridhar Babu |   ( Updated:2021-09-02 23:58:54.0  )
నాటువైద్యుల ప్రచారం.. అంతరించిపోతున్న గబ్బిలాలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: క్షీరద సంతతికి చెందిన ఏకైక పక్షి గబ్బిలం. అంతరించిపోతున్న పక్షిజాతుల్లో ఇది కూడా ఒకటి. ఈ పక్షి నేడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజులు వెల్లదీస్తోంది. అడ్డుకునే వారు లేకపోవడంతో వాటిని వెంటాడి వేటాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. నాటు వైద్యులు గబ్బిలాల నుంచి మందు తయారు చేయవచ్చని ప్రచారం చేయడంతో గబ్బిలాలను చంపేందుకు వేటగాళ్ల అవతరాం ఎత్తారు కొందరు. వాటి రెట్టతో పాటు రక్తం కూడా మందుల తయారీకి ఉపయోగపడుతుందని చెప్పడంతో వాటికి ఇటీవల కాలంలో డిమాండ్ పెరిగింది. దీంతో సాయంత్రం కాగానే గబ్బిలాలను చంపడమే పనిగా పెట్టుకున్నారు వేటగాళ్లు.

మందుల తయారీ కోసం..

గబ్బిలాల రెట్ట, రక్తం మందుల తయారీకి ఎంతో అవసరమని నాటు వైద్యులు చెప్తున్నారట. పక్షవాతం, కీళ్ల వాతం, సంతాన, లైంగిక సమస్యలతో పాటు ఇతరులను ఆకర్షించేందుకు అవసరమైన మందులు తయారు చేసేందుకు ఎంతో అవసరమని వారు ప్రచారం చేశారు. వీటితో తయారు చేసిన మందులకు ఫుల్ డిమాండ్ ఉండడంతో గబ్బిలాల ఉనికి ఉందంటే చాలు ఆ ప్రాంతంలో వేటగాళ్లు వాలిపోతున్నారు.

రాముని పల్లె కేంద్రంగా హంటింగ్..

కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం రాముని పల్లె గ్రామ పరిసరాల్లో పెద్ద ఎత్తున గబ్బిలాలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నాటు వైద్యులు, వారి అనుచరులు వేట మొదలు పెట్టారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటుగా మహరాష్ట్రకు చెందిన కొంతమంది రామునిపల్లెకు వచ్చి గబ్బిలాలను వల వేసి పట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు వేట గాళ్లను ప్రశ్నించడంతో వాటిని తింటామని చెప్పడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. కానీ, అసలు వాస్తవం వేరే ఉందని స్థానికులు అంటున్నారు.

ఇతరులు తమను ఆకర్షించేందుకు గబ్బిలాలు వేసే రెట్ట ఉపయోగపడుతుందని.. మరుగు మందుగా పిలవబడే దీనికి రూ. 2 వేలకు పైగానే ధర పలుకుతోందని తెలుస్తోంది. గబ్బిలాల రక్తాన్ని పక్షవాతం సోకిన వారి శరీర భాగాలకు రాస్తే తగ్గిపోతుందని, కీళ్ల వాతం ఇతరాత్ర నొప్పులున్నా.. అన్నింటికీ గబ్బిలాల మందు బెస్ట్ పెయిన్ కిల్లర్‌గా పని చేస్తుందని నాటు వైద్యులు ప్రచారం చేస్తున్నారు. లైంగిక సమస్యలతో బాధపడే వారికి గబ్బిలాల మందు దివ్య ఔషధంగా పని చేస్తుందని.. నాటు వైద్యులు చెప్తున్న మాటలు నమ్మిన చాలా మంది వారి వద్దకు క్యూ కడుతున్నారట. గబ్బిలాల ద్వారా పలు రకాల మందులు తయారు చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం గుప్పుమనడంతో వాటిని వేటాడి సొమ్ము చేసుకునే వారు అన్వేషణ మొదలు పెట్టారు. గబ్బిలాలను కాల్చి బూడిద చేసి ఇతర మూలికలతో కలిపి మందును తయారు చేస్తామని నాటు వైద్యలు చెప్తున్నారంటూ స్థానికంగా ప్రచారం సాగుతోంది. నాటు వైద్యానికి పనికొస్తాయన్న కారణంగా అత్యంత అరుదైన ఈ పక్షి జాతి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో పడిపోయింది.

వన్ వే…

గబ్బిలాలు ఆహారం తీసుకోవాలన్నా, మల మూత్రాలు విడుదల చేయాలన్నా కూడా నోటీ నుండే చేస్తుంటాయి. సహజ సిద్ధంగానే ఈ ప్రక్రియ వాటిలో నెలకొని ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే ఇవి వేములవాడ రాజన్న సన్నిధిలోని కొన్ని చెట్లపై ఆవాసం ఏర్పర్చుకున్నాయి. వాటికి సేఫ్ జోన్‎ అనుకుంటేనే ఆ ప్రాంతంలో నివాసం ఉంటాయి. తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని గ్రహిస్తే మాత్రం మరో ప్రాంతానికి వలస వెళ్తాయి.

Advertisement

Next Story

Most Viewed