ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి?

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవళ్లగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య గురువారం తెల్ల‌వారు జామున ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మరణించిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవళ్లగూడెంలో ఇరువర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

ఘ‌ట‌నా స్థ‌లి నుంచి కొంతమంది మావోయిస్టులు పారిపోగా.. మ‌రికొంత‌ మందిని పోలీసు బ‌ల‌గాలు చుట్టుముట్టినట్లు సమాచారం. జులై 15న భద్రాద్రి జిల్లా మ‌ణుగూరు డివిజన్‌ పరిధిలోని కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఒకరు గాయపడగా.. 10 మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. తాజా కాల్పుల మోతతో భద్రాలచం ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Advertisement