- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మ్యాచ్‌కు ముందు కన్నీళ్లు.. మ్యాచ్ అనంతరం వివరణ
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పేసర్, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్ గురువారం సిడ్నీ టెస్టు ప్రారంభానికి ముందు ఉద్వేగానికి లోనయ్యాడు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో సిరాజ్ కన్నీళ్లు పెట్టుకోవడం స్టేడియంలోని అభిమానులే కాకుండా టీవీల ముందు కూర్చున్న అనేకమంది ప్రేక్షకులు చూశాడు. సిరాజ్ ఎందుకు అలా ఏడ్చాడో ఎవరికీ అర్దం కాలేదు. ఈ మ్యాచ్‌లో వార్నర్ వికెట్ తీసి సిరాజ్ మంచి శుభారంభాన్ని కూడా అందించాడు.
కాగా, మ్యాచ్ అనంతరం తాను ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడో మీడియాకు తెలిపారు. ‘టీమ్ ఇండియా కోసం ఆడటం మా నాన్న కల. అది నెరవేరే సమయానికి నాన్న ఈ లోకంలో లేకుండా పోయాడు. టీమ్ ఇండియా జాతీయ గీతం ఆలపించే సమయంలో నేను జెర్సీ ధరించి స్టేడియంలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. అది గుర్తొచ్చి కన్నీళ్లు ఆగటలేదు’ అని సిరాజ్ తెలిపాడు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడే సిరాజ్ తండ్రి గౌస్ అనారోగ్యంతో కన్నుమూశారు. కనీసం తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాకుండా ఆస్ట్రేలియాలోనే సిరాజ్ జట్టుతో ఉంటున్నాడు.