తమ కార్ల ఉత్పత్తి ఆపితే..ఫ్యాక్టరీ వేరేచోటికి మార్చేస్తాం : ఎలన్ మస్క్!

by Harish |
తమ కార్ల ఉత్పత్తి ఆపితే..ఫ్యాక్టరీ వేరేచోటికి మార్చేస్తాం : ఎలన్ మస్క్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ పేరు చెప్పి స్థానిక అధికారులు టెస్లా కార్ల ఉత్పత్తికి అడ్డుపడితే తన ఎలక్ట్రిక్ కార్ల ప్రధాన కార్యలయాన్ని కాలిఫోర్నియా నుంచి తీసేస్తానని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ హెచ్చరించారు. అంతేకాకుండా, టెస్లా హెడ్ క్వార్టర్స్‌ను రానున్న కాలంలో టెక్సాస్ లేదా నెవాడాకు తరలించనున్నట్టు ఎలన్ మస్క్ సుధీర్ఘమైన ట్వీట్ చేశారు. మే ప్రారంభంలో కాలిఫోర్నియా ఫ్యాక్టరీని తెరవాలని టెస్లా కంపెనీ భావించింది. అయితే, దీన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలిసి ఎలన్ మస్క్ పైవిధంగా స్పందించారు. అలాగే, అమెరికా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా, చైనాను ప్రశంసించారు. కొవిడ్-19 వ్యాప్తిని అదుపులోకి తెచ్చిన వెంటనే చైనాలో తమ కార్ల ఉత్పత్తిని ప్రారభించామని చెప్పుకొచ్చాడు. ‘తమ టెస్లా సంస్థ చైనా ఫ్యాక్టరీకి ఉన్న అనుభవంతో చెప్తున్నాను..ఓ తాత్కాలిక అమెరికా అధికారి కంటే సురక్షితంగా ఎలా ఉండాలో, దానికోసం ఏంచేయాలో టెస్లా కంపెనీకి తెలుసని’ ఎలన్ మస్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story