కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆమె బతికే ఉంది..

by  |
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆమె బతికే ఉంది..
X

లండన్: కరోనా వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతుండటంతో అన్నిదేశాలు వ్యాక్సిన్ రూపొందించడంతో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు సార్-కోవ్-2 కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ సిద్ధం చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 800 మందిపై వ్యాక్సిన్ ప్రయోగించారు. బ్రిటన్‌కు చెందిన మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ఎలీసా గ్రనాటో అనే మహిళ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి ఈమె. అయితే వ్యాక్సిన్ వికటించి డాక్టర్ ఎలీసా గ్రనాటో మరణించిందని గత రెండు రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై బీబీసీ జర్నలిస్టు ఒకరు ఆరా తీయగా అదంతా ఫేక్ న్యూస్ అని తేలింది. ఆమె తన తల్లిదండ్రులతో మాట్లాడటమే కాకుండా బీబీసీకి ఒక వీడియోను స్కైప్ ద్వారా పంపించారు. ‘ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ట్విట్టర్ అకౌంట్ ఉపయోగించడం లేదు. కానీ, నాతో మాట్లాడారు. తనపై వచ్చిన వార్తలన్నీ ఫేక్ అని ఆమె చెప్పారు’ అని బీబీసీ మెడికల్ జర్నలిస్టు ఫెర్గుస్ వాల్ష్ ఒక ట్వీట్‌లో చెప్పారు.

Tags : Coronavirus, Vaccine, Human Trails, Dr Elisa Granato, Oxford University,UK,Covid-19


Next Story

Most Viewed