- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఓపెన్ కాస్ట్‌లో ఏనుగుదంతాలు

X
దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్‌లో తవ్వకాలు జరుపుతుండగా ఏనుగు దంతాలు బయటపడ్డాయి. దీంతో అక్కడి సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. బొగ్గు తవ్వకాల కోసం తీసిన మట్టి కుప్పల్లో ఏనుగు దంతాలు ఎక్కడినుంచి వచ్చాయని అనకుంటున్నారు. అయితే, గతంలో ఆ ప్రాంతంలో ఏనుగులు సంచరించిన అనవాళ్లు ఉన్నాయని వెల్లడైంది. ఏనుగు దంతాలను బయటకు తీసిన కార్మికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడకు చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
Next Story