- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేగంగా ఎలక్ట్రానిక్ వస్తువుల కాంట్రాక్ట్ తయారీ రంగం అభివృద్ధి!
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల కాంట్రాక్ట్ తయారీ రంగం 2025 నాటికి ఆరు రెట్లు పెరిగి సుమారు రూ. 11 లక్షల కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమల సంస్థ ఎల్సినా తెలిపింది. దేశీయ ఎలక్ట్రానిక్ తయారీ సేవల(ఈఎంఎస్) రంగం 2019-20లో రూ. 1.71 లక్షల కోట్లుగా నమోదైందని, ఇది 2025 నాటికి రూ. 11 లక్షల కోట్లకు చేరుకోవచ్చని ఎల్సినా అంచనా వేసింది. ప్రస్తుత ప్రపంచవ్యాప్త్నగా ఎలక్ట్రానిక్ తయారీ సేవల రంగంలో భారత్ వాటా ప్రస్తుతం 3 శాతంలోపు ఉండగా, రానున్న ఐదేళ్లలో ఏకంగా 14 శాతానికి పెరిగే అవకాశం ఉంది’ అని ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎల్సినా) ఓ ప్రకటనలో తెలిపింది.
‘దిగుమతులపై ఆధారపడటం తగ్గించాల్సిన అవసరం ఉందని, సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ లాంటి ఉత్పత్తుల తయారీలో భారత్‌కు భారీ అవకాశాలున్నాయని, ఈ క్రమంలో అధిక ప్రాధాన్యత కల్పిస్తూ, భారీ స్థాయిలో ఉత్పత్తులను చేపట్టేందుకు పరిశ్రమను ప్రోత్సహించాలని ఎల్సినా నివేదిక అభిప్రాయపడింది. ప్రస్తుతం చైనా, వియత్నాం దేశాలు ఈ రంగంపై పట్టును కలిగి ఉన్నాయి. ఇటీవల భారత్‌కు పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో దేశీయంగా ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని’ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఛైర్మన్ సంజీవ్ నారయణ్ చెప్పారు.