- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏసీబీ వలలో ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్
by Shyam |

X
దిశ, క్రైమ్‌బ్యూరో: నిజామాబాద్ జిల్లాలో ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కాంతారావు రూ.70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. హైదరాబాద్ మెహిదిపట్నంకు చెందిన రాజేశ్వర్ మంచిర్యాల జిల్లా రామగుండంలో విద్యుత్ ట్రాన్స్‌ఫర్మర్ ఏర్పాటుకు అప్రూవల్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరగా, అందుకు కాంతారావు రూ.70వేల లంచం అడిగాడు. దీంతో రాజేశ్వర్.. మే 7న రూ.30వేలు, 9న మరో రూ.20వేలను చెల్లించాడు. అయినా సంబంధిత సర్టిఫికెట్ కోసం కాంతారావు మరో రూ.70వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రాజేశ్వర్ హైదరాబాద్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హైదరాబాద్ నారాయణగూడలోని తన నివాసంలో కాంతారావు రూ.70వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
Next Story