రూ. 5 లక్షల కోట్లకు చేరుకోనున్న భారత ఎలక్ట్రిక్ పరికరాల మార్కెట్

by Harish |   ( Updated:2021-09-19 23:11:16.0  )
రూ. 5 లక్షల కోట్లకు చేరుకోనున్న భారత ఎలక్ట్రిక్ పరికరాల మార్కెట్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని ఎలక్ట్రిక్ పరికరాల మార్కెట్ 2025 నాటికి 12 శాతం వార్షిక వృద్ధితో సుమారు రూ. 5.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ భావిస్తోంది. ప్రస్తుతం దేశీయ ఎలక్ట్రిక్ పరికరాల మార్కెట్ విలువ రూ. 3.50-3.60 లక్షల కోట్ల మధ్య ఉందని ఇండియన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తయారీదారుల సంఘం(ఐఈఈఎంఏ) అధ్యక్షుడు అనిల్ సబూ అన్నారు. సంస్థ వార్షిక వృద్ధి 11-12 శాతం మధ్య ఉందని అనిల్ చెప్పారు. రానున్న రోజుల్లో ఈ పరిశ్రమ మరింత వేగవంతంగా పుంజుకుంటుందన్నారు.

దీనివల్ల భారత ఎగుమతుల విలువ ప్రస్తుతం ఉన్న రూ. 63.5 వేల కోట్ల నుంచి రూ. 96 వేలకోట్లకు పెరుగుతుందని, చైనాకు ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ మార్కెట్ భారత్ వైపు చూస్తోందని అనిల్ సబూ అభిప్రాయపడ్డారు. త్వరలో భారత పునరుత్పాదక ఇంధన లక్ష్యాలతో పాటు కార్బన్ తగ్గింపు లక్ష్యాలను చేరుకోవడం ద్వారా స్థానిక విద్యుత్ పరికరాల పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యాన్ని 2030 నాటికి 450 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా ఉంది. ఈ నేపథ్యంలో పునరుత్పాదక శక్తిని పెంచేందుకు కొత్త పరికరాలు అవసరమవుతాయి. దీనివల్ల స్థానిక సంస్థలు కొరతను తీర్చగలవని అనిల్ వివరించారు.

Advertisement

Next Story