ప్రతికూలంలోనే కీలక ఎనిమిది రంగాల ఉత్పత్తి!

by Harish |
ప్రతికూలంలోనే కీలక ఎనిమిది రంగాల ఉత్పత్తి!
X

దిశ, వెబ్‌డెస్క్ : ముడి చమురు, సహజవాయువు, రిఫైనరీ, ఉక్కు ఉత్పత్తి తగ్గడంతో ఎనిమిది కీలక రంగాలు వరుసగా ఎనిమిదో నెలలో పతనాన్ని చవిచూశాయి. శుక్రవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 2.5 శాతం తగ్గింది. అయితే, సెప్టెంబర్‌లో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 0.1 శాతం కుదించిన సంగతి తెలిసిందే. కాగా, ముడి చమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, బొగ్గు, విద్యుత్, సిమెంట్ అన్ని రంగాలు సెప్టెంబర్‌లో ప్రతికూల వృద్ధిని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, అక్టోబర్‌లో కొంత మెరుగుపడి ముడి చమురు 6.2 శాతం, సహజవాయువు 8.6 శాతం, రిఫైనరీ 17 శాతం, ఉక్కు ఉత్పత్తి 2.7 శాతం మాత్రమే ప్రతికూల గణాంకాలను నమోదు చేశాయి. బొగ్గు ఉత్పత్తి అక్టోబర్ నెలలో అధికంగా 11.6 శాతం పెరిగింది. ఎరువులు 6.3 శాతం, సిమెంట్ 2.8 శాతం, విద్యుత్ ఉత్పత్తి 10.5 శాతం పెరిగినట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed