- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సానుకూలంగా కీలక రంగాల ఉత్పత్తి!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి ఈ ఏడాది జనవరిలో 0.1 శాతం పెరిగింది. శుక్రవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి వరుసగా మూడు నెలలు ప్రతికూలత తర్వాత స్వల్పంగా కోలుకున్నాయి. ముఖ్యంగా.. ఎరువులు, ఉక్కు, విద్యుత్ రంగాల మెరుగైన ప్రదర్శనతో ఈ పెరుగుదల నమోదైంది.
గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి మౌలిక రంగా ఉత్పత్తి 1.3 శాతం క్షీణతను నమోదు చేసిన సంగతి తెలిసిందే. సిమెంట్ ఉత్పత్తి జనవరిలో 5.9 శాతానికి పడిపోయింది. బొగ్గు ఉత్పత్తి 1.8 శాతం క్షీణించింది. ముడి చమురు 4.6 శాతం, సహజ వాయువు ఉత్పత్తి 2 శాతం పడిపోయింది. పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి కూడా జనవరి 2020 తో పోలిస్తే 2.6 శాతం క్షీణించింది. ఎరువులు 2.7 శాతం, ఉక్కు 2.6 శాతం, విద్యుత్ రంగంలో ఉత్పత్తి 5.1 శాతం పెరిగింది.
Advertisement
Next Story