- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెమొరీ పవర్ పెరగాలంటే?
దిశ, వెబ్‌డెస్క్ : విద్యార్థి అయినా, వర్కింగ్ ప్రొఫెషనలైనా, సీనియర్ సిటిజన్ అయినా.. ‘షార్ప్ మెమొరీ’ చాలా ముఖ్యం. చాలా మంది తమ తమ బిజీ షెడ్యూల్స్ వల్ల కొన్నింటిని మర్చిపోతుంటారు. అది సహజం. కానీ పూర్ మెమొరీ ఉంటే మాత్రం అది కాస్త ప్రాబ్లమే అని చెప్పాలి. మెమొరీ లాస్‌ను ప్రివెంట్ చేయలేకపోవచ్చు గానీ వయసు పెరుగుతున్నా.. మెమొరీ పవర్‌ను తగ్గనీయకుండా చూసుకోవచ్చు. మనం తినే ఫుడ్ విషయంలో సింపుల్ స్ట్రాటజీస్ పాటిస్తే చాలు.. నేచురల్‌గానే మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది.
మైండ్‌ఫుల్ ఈటింగ్..
చాలా మంది గుడ్ ఫుడ్ హాబిట్స్‌ను అలవర్చుకోవాలనుకుంటారు కానీ సరైన శ్రద్ధ చూపరు. అంతేకాదు టిఫిన్స్, మీల్స్‌ను స్కిప్ చేస్తుంటారు. చూడ్డానికి ఇది చాలా చిన్న సమస్యలాగే కనిపిస్తుంది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ.. ఆ ఇంపాక్ట్ మెంటల్ హెల్త్‌పై పడుతుంది. అందువల్లే మెమొరీ పెంచే ఆహారాన్ని తినాలి. ఆయిలీ, స్పైసీ, ఫ్రోజెన్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీలైనంత ఎక్కువగా ఫ్రూట్స్ తినాలి. మన డైట‌్‌లో వెజిటేబుల్స్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలి. న్యూట్రియంట్స్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయాలు తినడం వల్ల.. ఫ్రీరాడికల్ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. బ్లూబెర్రీ, టమాటా, స్పినాచ్ డైట్‌లో ఉంటే బెటర్.
స్టే యాక్టివ్ :
రోజంతా ఉత్సాహంగా ఉండటం వల్ల మెదడు కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఒకవేళ మనం డిప్రెషన్‌లో లేదా మూడీగా ఉంటే.. దాని ప్రభావం మెదడుపై కూడా పడుతుంది. యాక్టివ్‌గా ఉండాలంటే జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు, విపరీతంగా బరువులు మోయాల్సి పని కూడా లేదు. సింపుల్‌గా స్పోర్ట్స్ ఆడితే చాలు. కాసేపు నడవడం, డ్యాన్స్ చేయడం, సైకిల్ తొక్కడం, స్విమ్మింగ్ వంటివి చేసినా మంచి ఫలితం ఉంటుంది. బాడీ మూమెంట్స్ వల్ల బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. దీంతో మైండ్ చాలా హెల్తీగా మారుతుంది. మెటబాలిజమ్ కూడా ఇంప్రూవ్ కావడంతో బ్రెయిన్ ఫంక్షన్ మెరుగవుతుంది.
కీప్ లెర్నింగ్..
యాక్టివ్‌గా ఉండటం, మెంటల్లీ యాక్టివ్‌గా ఉండటం రెండు వేర్వేరు. కానీ ఈ రెండూ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. మెదడుకు పదును పెడుతూ ఎప్పటికప్పుడు చాలెంజ్‌లు విసురుతుంటే.. అది మరింత యాక్టివ్‌గా తయారవుతుంది. కొత్త కొత్త భాషలు నేర్చుకోవడం, తెలియని అంశాల గురించి శోధించడం, పుస్తక పఠనం, క్రాస్‌వర్డ్, పజిల్స్, ప్రాబ్లమ్స్, లాజికల్ క్వశ్చన్స్ వంటివి మెదడుకు పని చెప్పేవి.
సోషలైజ్..
ఒంటరిగా, ముడుచుకుని కూర్చుంటే మన మెదడు కూడా అలానే మూడీగా ఉండిపోతుంది. అందుకే ఎక్కువగా సమాజంతో కలుస్తుండాలి. కొత్త కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకోవాలి. వారితో మాట్లాడాలి, ఐడియాస్ ఎక్స్‌చేంజింగ్ జరగాలి, సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్‌ల నుంచి కూడా బయటపడొచ్చు.
స్లీప్ క్వాలిటీ..
మంచి నిద్ర కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్, మెంటల్ రెస్ట్ రెండూ కూడా బ్రెయిన్‌ను హెల్తీగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బ్రెయిన్ మెమొరీ సెంటర్‌ను ‘హిప్పోక్యాంపస్’ అంటారు. డిప్రెషన్, ఒత్తిడి వల్ల ఇది దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే రోజూ 8 గంటల పాటు మంచి నిద్ర పోతే… ఒత్తిడి తగ్గిపోవడంతో పాటు బ్రెయిన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మెడిటేషన్ కూడా మెమొరీ పవర్‌ను పెంచుతుంది.