- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మొగల్ సామ్రాజ్యం ఇక కనుమరుగు.. పాఠ్య పుస్తకాల్లో నుంచి తొలగింపు!

దిశ, వెబ్‌డెస్క్: పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేర్పులు తరచూ జరుగుతూనే ఉంటాయి. కొన్ని సార్లు కొత్త పాఠాలను చేర్చడం.. మరికొన్నీటిని తొలగించడం చేస్తుంటారు. అయితే ఈసారి భారతదేశం పరిపాలన తో ముడిపడి ఉన్న చరిత్రనే తొలగించడం గమనార్హం. 12వ, తరగతి చరిత్ర పుస్తకాల్లో మొఘల్ సామ్రాజ్యం పాఠ్యాంశం ఇకపై కనిపించదు. ‘మొఘల్ సామ్రాజ్యం’ చాప్టర్లను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) తొలగించింది. ఈ మార్పు దేశవాప్తంగా ఎన్సీఈఆర్టీని అనుసరించే అన్ని స్కూల్స్‌కు వర్తించనున్నది. థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్-2లో ఉన్న ‘కింగ్ అండ్ క్రానికల్స్: ది మొఘల్ కోర్ట్స్ (సీ.16,17వ శతాబ్దాలు) చాప్టర్లను పూర్తిగా తొలగించింది. హిస్టరీతోపాటు హిందీ, సివిక్స్ పుస్తకాల్లోనూ మార్పులు చేసింది. 10, 11వ తరగతి పుస్తకాల్లోనూ పలు పాఠ్యాంశాలను ఎన్సీఈఆర్టీ తొలగించింది. ఈ మార్పులు 2023-24 విద్యా సంవత్సరం నుంచే అమలవుతాయని ఎన్సీఈఆర్టీ పేర్కొన్నది.