ఏపీ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే

by Javid Pasha |
ఏపీ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూల్‌ను బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ అధికారులు విడుద‌ల చేశారు. జూన్ 2 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు నిర్వహించ‌నున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉద‌యం 9:30 గంట‌ల‌కు నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు ఈ ప‌రీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

జూన్ 2 – ఫ‌స్ట్ లాంగ్వేజ్, జూన్ 3 – సెకండ్ లాంగ్వేజ్,జూన్ 5 – ఇంగ్లీష్‌, జూన్ 6 – మ్యాథ్స్ పరీక్షలు జరగనున్నట్లు వెల్లడించారు. జూన్ 7 – సైన్స్, జూన్ 8 – సోష‌ల్ స్టడీస్, జూన్ 9 – ఫ‌స్ట్ లాంగ్వేజ్ పేప‌ర్ -2 (కంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ 1, జూన్ 10 – ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story