NTA సంచలన నిర్ణయం.. OMR పద్ధతిలో నీట్ యూజీ పరీక్షలు

by Jakkula Mamatha |
NTA  సంచలన నిర్ణయం.. OMR పద్ధతిలో నీట్ యూజీ పరీక్షలు
X

దిశ,వెబ్‌డెస్క్: NEET UG పరీక్షల నిర్వహణ పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది(2025) పరీక్షను పెన్ &పేపర్(OMR) పద్ధతిలో కండక్ట్ చేస్తామని ప్రకటించింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్ (NMC) ఖరారు చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్టులో నిర్వహిస్తామని తెలిపింది. 2019 నుంచి నీట్(UG) పరీక్షను ఎన్టీయే నిర్వహిస్తోంది. నీట్‌ (UG) ఫలితాల ఆధారంగా నేషనల్‌ కమిషన్ ఫర్‌ హోమియోపతి కింద BHMS కోర్సు అడ్మిషన్లు నిర్వహిస్తారు. దీంతోపాటు ఆర్మ్‌డ్‌ మెడికల్‌ సర్వీస్‌ హాస్పిటల్స్‌లో BSC నర్సింగ్‌ కోర్సు అడ్మిషన్లకు నీట్ (UG) క్వాలిఫై కావాల్సి ఉంటుంది. నాలుగేండ్ల BSC నర్సింగ్‌ కోర్సుకు కూడా NEET(UG) కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని NTA తెలిపింది. గత ఏడాది ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.


Advertisement
Next Story

Most Viewed