JEE మెయిన్ 2024 సెషన్ 2 అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

by Sumithra |
JEE మెయిన్ 2024 సెషన్ 2 అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
X

దిశ, ఫీచర్స్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE మెయిన్ 2024 సెషన్ 2 పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. హాల్ టికెట్ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.inలో విడుదల చేశారు. ఏప్రిల్ 4, 5, 6వ తేదీల్లో జరిగే పరీక్షల కోసం అడ్మిట్ కార్డ్ జారీ చేశారు. సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుంది.

ముందుగా ఈ పరీక్ష ఏప్రిల్ 4 నుంచి 15 వరకు షెడ్యూల్ చేసినా తర్వాత నేషనల్ ఎగ్జామినేషన్ ఏజెన్సీ పరీక్ష తేదీని మార్చి 4వ తేదీ నుంచి 12వ తేదీకి మార్చింది. NTA సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.

JEE మెయిన్ 2024 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా ?

JEE మెయిన్ jeemain.nta.ac.in అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి.

ఇక్కడ JEE మెయిన్ 2024 సెషన్ 2 అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.

రిజిస్ట్రేషన్ నంబర్ తదితర వివరాలను నమోదు చేసి సమర్పించండి.

మీ స్క్రీన్‌పై హాల్ టికెట్ కనిపిస్తుంది.

ఇపుడు డౌన్లోడ్ చేసుకోండి.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డు లేకుండా పరీక్ష హాలులోకి ప్రవేశించడానికి అనుమతించరని గుర్తుంచుకోవాలి. పరీక్ష అడ్మిట్ కార్డ్‌తో పాటు, మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ వంటి ఫోటోతో కూడిన అధికారిక గుర్తింపు కార్డును కూడా తీసుకెళ్లాలి.

అడ్మిట్ కార్డ్‌లో పరీక్ష మార్గదర్శకాలు, పరీక్ష తేదీ, సమయం, అభ్యర్థి పేరు, దరఖాస్తు నంబర్, రోల్ నంబర్, సంరక్షకుడి పేరు, విషయం పేరు, లింగం, పుట్టిన తేదీ, వర్గం మొదలైన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోంది. NTA జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రంలో జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.

JEE మెయిన్ 2024 పేపర్ 1 (BE/B.Tech) ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్ 2 (బి.ఆర్క్, బి.ప్లానింగ్) పరీక్ష ఏప్రిల్ 12వ తేదీన జరగనుంది. పేపర్ 1 పరీక్షను రెండు షిఫ్టుల్లో, పేపర్ 2 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే షిఫ్టులో నిర్వహిస్తారు. JEE మెయిన్ 2024 సెషన్ 2 పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 15లోపు ప్రకటించవచ్చు.

Next Story

Most Viewed