- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ అలర్ట్.. నేడే టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్
దిశ, వెబ్ డెస్క్: లక్షలాది మంది విద్యార్థుల ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్ లోని గోల్డెన్ జూబ్లీ హాల్ లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు ఉదయం9.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ లకు సంబంధించిన పలు కోర్సుల్లో ఈ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఇక రిజల్ట్స్ కోసం విద్యార్థులు eamcet.tsche.ac.in. వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
కాగా ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్ (EAMCET) పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా.. వీటిలో 3,01,789 మంది విద్యార్థలు పరీక్షలు రాశారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేసుకోగా.. 65,871 మంది మాత్రమే పరీక్షలు రాశారు.