- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) 2023
దిశ, ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా ఒకే పరీక్షతో అన్ని జాతీయ విద్యా సంస్థల పీజీ సీట్లకు పోటీ పడే అవకాశం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) కల్పిస్తోంది. ఈ మేరకు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదలైంది. తాజా నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యా సంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి.
ఎంట్రన్స్ టెస్ట్:
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) 2023
కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంఎఫ్ఏ, ఎంపీఏ, ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ వొకేషన్, ఎంఎడ్, ఎంఎల్ఐఎస్సీ, ఎంపీఈడీ, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంకాం..
అర్హత: డిగ్రీ పూర్తయిన వారు.. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న వారు సీయూఈటీ రాయవచ్చు. పీజీ కోర్సులను బట్టి సంబంధి డిగ్రీ కోర్సు చదివిన వారై ఉండాలి.
ఆన్‌లైన్ టెస్ట్: సీయూఈటీ పరీక్షను ఆన్‌లైన్ లో నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 19, 2023.
అప్లికేషన్ ఫీజు:
మూడు టెస్ట్ పేపర్లకు.. జనరల్ అభ్యర్థులకు రూ. 1000 చెల్లించాలి
ఓబీసీ.. ఎన్‌సీఎల్/జనరల్ ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 800
ఎస్సీ/ఎస్టీ/థర్డ్ జెండర్‌లకు రూ. 750
దివ్యాంగులైతే రూ. 700 చెల్లించాలి.
నోట్: ప్రతి అదనపు పేపర్‌కు జనరల్ అభ్యర్థులకు రూ. 500, ఇతరులకు రూ. 400 చొప్పున ఫీజు చెల్లించాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: ఏపీలో 24, తెలంగాణలో 11 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://cuet.nta.nic.in/