- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులు కలలో కూడా ఊహించని శుభవార్త.. ఇక నుంచి చూసుకుంటూనే పరీక్షలు రాసే ఛాన్స్?
దిశ, వెబ్‌డెస్క్: స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు అనే తేడా లేకుండా విద్యార్థులంతా కోరుకునేది ఒకే ఒక్కటి. అదే పరీక్షలు లేకపోతే బావుండని. అయితే, సల్ప మార్పులు జరిగినా సరిగ్గా విద్యార్థులకు అలాంటి శుభవార్తే రాబోతోంది. ఇక నుంచి పుస్తకాలు చూసుకుంటూ పరీక్షలు రాసే సౌకర్యం రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు యూనివర్సిటీలు ఓపెన్ బుక్ పరీక్షా(OBE) విధానాన్ని అమలు చేస్తున్నాయి. తాజాగా.. ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు సీబీఎస్‌ఈ(CBSE) ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో 9th నుంచి 12th వరకు కొన్ని సబ్జెక్టులను ఓబీఈ విధానంలో నిర్వహించడానికి కసరత్తు ప్రారంభించారు. ఈ విధానం తీసుకురావడం ద్వారా విద్యార్థులు విషయ పరిజ్ఞానం, విశ్లేషణాత్మక సామర్థ్యం, సృజనాత్మకతను తెలుసుకునే అవకాశం ఉంటుందని సీబీఎస్ఈ భావిస్తోంది.
అయితే, ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే పుస్తకాలు చూసి పరీక్ష రాయడం. ఈ విధానంలో విద్యార్థులు పుస్తకాలు, నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ తీసుకుని పరీక్షా కేంద్రాలకు వెళ్లొచ్చు. దీని ఉపయోగం ఏమిటంటే.. పరీక్షల్లో విద్యార్థి జ్ఞాపకశక్తిని పరీక్షించడానికి బదులు.. ఆ సబ్జెక్ట్ విద్యార్థికి ఎంతమేర అర్థమైంది.. ఏ మేరకు విశ్లేషించగలుగుతున్నాడనే దానిని తెలుసుకోవడం. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. దీనిపై తల్లిదండ్రులు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ విధానం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. ఒక ప్రయోగం అయితే చేసి చూద్దామని మరి కొందరు భావిస్తున్నారు.