- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కీ విడుదలపై క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 2023 –24 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీఎస్ ఐసెట్-2023’ ఫలితాలను, ఫైనల్ కీ పేపర్‌ను జూన్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని జూన్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు టీఎస్ ఐసెట్- 2023 కన్వీనర్ పి.వరలక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాథమిక ‘కీ’పై ఏవైనా అభ్యంతరాలుంటే జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు www.icet.tsche.ac.in వెబ్ సైట్‌లో ఉన్న అభ్యంతరాల ఫార్మాట్ ద్వారా [email protected] కు మెయిల్ చేయవచ్చని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 20 కేంద్రాల్లో మే నెల 26, 27 తేదీల్లో.. మొత్తం నాలుగు సెషన్‌లలో ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు 70,900 మంది విద్యార్థులు హాజరయ్యారని కన్వీనర్ తెలిపారు.