విద్యార్థులకు అలర్ట్.. AICTE అకడమిక్ క్యాలెండర్‌ విడుదల.. క్లాసులు ఎప్పుడంటే..?

by Harish |   ( Updated:2023-04-05 17:19:48.0  )
విద్యార్థులకు అలర్ట్.. AICTE అకడమిక్ క్యాలెండర్‌ విడుదల.. క్లాసులు ఎప్పుడంటే..?
X

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఇంజనీరింగ్ కాలేజీలు, మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్లు, ఇతర టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌ల 2023-24 అకడమిక్ సెషన్‌కి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ఆధారంగా ఫ్రెషర్స్, తొలి ఏడాది విద్యార్థులకు తరగతులు 2023, సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. అధికారిక AICTE క్యాలెండర్ ప్రకారం ఖాళీలు, టెక్నికల్ కోర్సులు, లేటరల్ అడ్మిషన్‌ల భర్తీ కోసం ఈ గడువును ఏఐసీటీఈ నిర్ణయించింది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు PGDM, PGCM కోర్సులు కూడా 2023, సెప్టెంబర్ 15న ప్రారంభమవుతాయి. ఈ మేనేజ్‌మెంట్ కోర్సుల కోసం విద్యా సంస్థలు 2023, సెప్టెంబర్ 11 వరకు పూర్తి ఫీజు రీఫండ్‌తో అడ్మిషన్లను రద్దు చేయవచ్చని AICTE తెలిపింది. ఇంజనీరింగ్‌, టెక్నాలజీ కోర్సుల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్‌లు, రెండో సంవత్సరం లేటరల్‌ ఎంట్రీకి కూడా సెప్టెంబర్‌ 15 యే చివరి తేదీ. పూర్తి ఫీజు రీఫండ్‌తో టెక్నికల్ కోర్సుల సీట్ల రద్దుకు గడువును సెప్టెంబర్ 11 గా నిర్ణయించింది.

యూనివర్సిటీలు/బోర్డులు అనుబంధాన్ని మంజూరు చేయడానికి గడువును 2023, జులై 31గా నిర్దేశించింది. స్వతంత్ర PGDM/PGCM సంస్థలు మినహా అన్ని ఇన్‌స్టిట్యూట్‌లకు ఈ తేదీలు వర్తిస్తాయి. ఇక దూరవిద్య కోర్సులు, ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ల తరగతులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్దేశించిన అధికారిక మార్గదర్శకాల ప్రకారం ప్రారంభమవుతాయి.

పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ aicte-india.org లో 2023-24 అకడమిక్ సెషన్‌కి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు.

Advertisement

Next Story