ఈ పరీక్షలో ఎంపికైతే చాలు.. ఉచిత వసతి, ఇంగ్లీష్ మీడియంలో విద్య

by Harish |
ఈ పరీక్షలో ఎంపికైతే చాలు.. ఉచిత వసతి, ఇంగ్లీష్ మీడియంలో విద్య
X

దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 28 ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 2023- 24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7,8,9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది.

ఇందులో ఎంపికైతే ఉచిత వసతి, విద్య అందిస్తారు. తరగతులను ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారు. అలాగే సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు.

పరీక్ష వివరాలు:

ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు.

సీట్ల వివరాలు:

ప్రతి విద్యాలయంలో 60 సీట్లు చొప్పున మొత్తం 1,680 (బాలురు 840, బాలికలు 840) సీట్లు ఉన్నాయి.

ఏడో తరగతిలో ఖాళీలు: 126 (బాలురు 78, బాలికలు 48)

ఎనిమిదో తరగతిలో ఖాళీలు: 81 (బాలురు 53, బాలికలు 28)

తొమ్మిదో తరగతిలో ఖాళీలు: 53 (బాలికలు 29, బాలురు 24) ఉన్నాయి.

అర్హతలు: ఆరో తరగతిలో ప్రవేశాలు పొందేవారు తప్పనిసరిగా 2022-23 ఏడాదిలో 5వ తరగతి చదివి ఉండాలి. 7,8,9 ప్రవేశం పొందే విద్యార్థులు వరుసగా 6,7,8 తరగతులు చదివి ఉండాలి.

విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 1 లక్షకు మించరాదు.

వయసు: మార్చి 31, 2023 ఆరో తరగతికి 10 నుంచి 13 ఏళ్లు, 7వ తరగతికి 11 నుంచి 14 ఏళ్లు, 8వ తరగతికి 12 నుంచి 15 ఏళ్లు, 9వ తరగతికి 13 నుంచి 16 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 15, 2023.

వెబ్‌సైట్: https://twreiscet.apcfss.in

Advertisement

Next Story

Most Viewed