- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఆగస్టు 3 నుంచి 2020-21 విద్యా సంవత్సరం ఆరంభం
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో 2020-21 సంవత్సరానికి సంబంధించిన విద్యా సంవత్సరం ఆగస్టు 3 నుంచి ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు విధివిధానాలు రూపొందించినట్టు విద్యాశాఖ వెల్లడించింది. విద్యా సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం కింద పలు అభివృద్ధి పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇవన్నీ జూలై చివరినాటికి పూర్తికానున్నట్టు తెలుస్తోంది. అన్ని సౌకర్యాలతో అత్యాధునికంగా తీర్చిదిద్దిన పాఠశాల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు నిధులు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. స్కూళ్లలోని పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు వంటి సౌకర్యాలు ప్రభుత్వమే సమకూర్చనుంది. ఈ మేరకు విద్యాశాఖాధికారులు పనులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారుల ఆధ్వర్యంలో వేగంగా స్కూళ్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ మేరకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది