నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు?

by Ravi |   ( Updated:2023-01-28 02:23:30.0  )
నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు?
X

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలోని ప్రజలు రెండు సార్లు అధికారమిచ్చారు. అయితే రాష్ట్రం ఏర్పడి, ప్రభుత్వంలోకి వచ్చి తొమ్మిది ఏండ్లు కావొస్తున్నా రాష్ట్రంలో పూర్తి స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగడం లేదు. రాష్ట్రం ఏర్పడక ముందు నుండి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ జెండా మోసిన కార్యకర్తలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వం అంతా ఏళ్ల తరబడి నామినేటెడ్ పదవులు ఎప్పుడు ప్రకటిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. సామాజిక వర్గాలు, ప్రాంతీయ ఈక్వేషన్స్, పార్టీ పట్ల విధేయత, పార్టీకి చేసిన సేవను బేరీజు వేసుకొని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని ఎదురుచూస్తున్నారు.

రాష్ట్ర ఉద్యమంలో ఇప్పటికే క్రియాశీలకంగా పనిచేసిన ప్రథమ శ్రేణి నాయకులకు వివిధ హోదాల్లో అవకాశం కల్పించిన కేసీఆర్, అదే విధంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను కూడా పరిగణలోకి తీసుకోవాలని పార్టీ అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించి ఎంతోమంది వెనకబడిన కులాలకు మార్కెట్ కమిటీ చైర్మన్‌లుగా అవకాశం కల్పించారు. అదేవిధంగా రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పదవుల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు దానికి కృతజ్ఞతలు. ఇప్పటికే కొన్ని పోస్టులు భర్తీ చేసినప్పటికీ మొత్తం పూర్తి స్థాయి కమిటీని నియమించాలి. రాష్ట్రంలో 50 పైగా కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయనేది సమాచారం. వాటిని త్వరగా భర్తీ చేయాలి. అయితే ఈ పదవుల భర్తీ కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17 నుంచి మొదలయ్యేలా చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్న సందర్భాన్ని, దేశంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరును నేటి సమాజానికి తెలియపరిచేందుకు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి, యువజన, మహిళ విభాగాలకు వారం రోజులు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర పథకాలు దేశవ్యాప్తం కావాలంటే కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం.

గుండమల్ల సతీష్ కుమార్.

9493155522

Also Read...

ఫ్రెండ్లీ ప్రభుత్వంతో ప్రయోజనమెవరికీ..?

Advertisement

Next Story