- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నోటిఫికేన్లు ఎప్పుడు?
రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటించి. ఇందులో గురుకుల ఉపాధ్యాయులు 12 వేలు, టీఆర్టీ ద్వారా 12 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. అయితే ఈ పోస్టుల భర్తీ కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు. అయితే ఇందులో అర్హత పొందిన విద్యార్థులు సుమారు 4 లక్షల మంది టీఆర్టీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు సైతం గురుకుల టీచర్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిచ్చి దాదాపు 10 నెలలు దాటినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఇక టీఆర్టీ నోటిఫికేషన్ కోసం ఆర్థిక శాఖ ఇప్పటివరకు అనుమతివ్వలేదు. దీనికి కారణంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ పేర కాలయాపన చేస్తున్నారు. ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల ఎంతో మంది అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి టీఆర్టీ ప్రకటన విడుదల చేయాలి.
రావుల రామ్మోహన్ రెడ్డి
93930 59998