విద్యారంగాన్ని విస్మరించిన బడ్జెట్!

by Ravi |   ( Updated:2024-07-25 00:30:45.0  )
విద్యారంగాన్ని విస్మరించిన బడ్జెట్!
X

పార్లమెంట్‌లో మంగళవారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైనది. దేశ భవిష్యత్తుకు, దేశ అభివృద్ధికి దిక్సూచి అయిన విద్యారంగానికి కేవలం 1,25, 638 కోట్లు మాత్రమే కేటాయించి పూర్తిగా విద్యారంగాన్ని విస్మరించింది. అలాగే విభజన హామీల్లో భాగంగా తెలంగాణకు కేటాయించాల్సిన ఐఐఎం, ఐఐఐటి, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరు మంది ఎంపీలు అధికార పార్టీలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుంటే స్పందించకపోవడం సిగ్గుచేటు.

తెలంగాణకు బడ్జెట్‌లో రిక్తహస్తం

ఏడాదికేడాది విద్యారంగానికి నిధుల కేటాయింపు తగ్గిస్తూ, నరేంద్ర మోడీ ప్రైవేట్, కార్పొరేట్, విదేశీ వ్యాపారాలను ప్రోత్సహించడం చూస్తే కేంద్రం లోని ఎన్డీఏ ప్రభుత్వానికి విద్యారంగంపై ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతుంది. ఈ బడ్జెట్ కేటాయింపులను పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణమే బడ్జెట్‌ను సవరించి విద్యారంగానికి 10% నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విద్యారంగానికి జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.

పెద్దింటి రామకృష్ణ

పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ

97055 18978

Advertisement

Next Story

Most Viewed