- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జ్ఞాపకశక్తి లోపానికి మార్గం..మాట్లాడటమే!
ఎక్కువ మాట్లాడే వయోధికులను పిచ్చివారిగా ఎగతాళి చేస్తున్నారు, కానీ వైద్యులు దీనిని ఒక వరంగా భావించాలని చెబుతున్నారు. ప్రస్తుతం జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ఏ మార్గం లేనందున పదవీ విరమణ పొందినవారు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడాలని వైద్యులు చెపుతున్నారు. వీరు ఎక్కువ మాట్లాడటం వలన మూడు ప్రయోజనాలు ఉంటాయని తెలుపుతున్నారు. ఇలా ఎక్కువగా మాట్లాడుతుండటం వలన మెదడు చురుకుగా ఉంటుంది. ఎందుకంటే భాష, ఆలోచన ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. అలాగే త్వరగా మాట్లాడినప్పుడు, ఇది సహజంగా వేగంగా ఆలోచించే ప్రతిచర్యలకు దారితీస్తుంది. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. మాట్లాడని సీనియర్ సిటిజన్‌లకు జ్ఞాపకశక్తి లోపం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా మాట్లాడటం వల్ల ఒత్తిడి తొలగిపోతుంది. మానసిక అనారోగ్యం దూరం అవుతుంది ఒత్తిడి తగ్గుతుంది. మనం తరచు ఏమీ మాట్లాడకుండా గుండెల్లో పెట్టుకుని ఉక్కిరిబిక్కిరి అయి అసౌకర్యానికి లోనవుతుంటాం నిజమే, కాబట్టి సీనియర్లకు ఎక్కువ మాట్లాడే అవకాశం కల్పించాలి. మాట్లాడటం వలన ముఖం గొంతు చురుకైన కండరాలు వ్యాయామం చేయవచ్చు. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే కళ్ళు, చెవులు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మైకం, వెర్టిగో, చెవుడు వంటి దాగి ఉన్న ప్రమాదాలను తగ్గిస్తుంది. అలాగే వీరిలో అల్జీమర్స్ రాకుండా నియంత్రిస్తుంది. అందుకే వృద్ధులు, వయోధికులు, రిటైర్మెంట్ పుచ్చుకున్నవారు వీలయినంత ఎక్కువ మాట్లాడటం, వ్యక్తులతో చురుగ్గా మాట్లాడడం చేయాలి!
దండంరాజు రాంచందర్ రావు
రిటైర్డ్ ఉద్యోగి, సింగరేణి భవన్
98495 92958