- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సనాతన ధర్మాన్ని ఏం చేయలేరు!
హిందువులు ఆచరించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి బహిరంగ వ్యాఖ్యలు చేయడం దుస్సాహసమే. ఆయన ఒక రాష్ట్ర మంత్రిని అనే విషయాన్ని మరిచిపోయి, ఒక వీధి రౌడీ మాదిరి బరితెగించి మాట్లాడడం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం. పైగా ఇలాంటి మాటలే మరీ మరీ మాట్లాడతానని, అందుకోసం దేనికైనా సిద్ధమేనని ప్రకటించడం సమాజంలో అశాంతిని, ఆందోళనలను, ప్రేరేపించడమే.
తమిళ ప్రజలపై ఆ ప్రభావం..
అయితే ఉదయనిధి ప్రగతిశీల రచయితల ఫోరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడానికి బలమైన కారణమే ఉంది. తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకు హిందూత్వ అభిమానుల సంఖ్య పెరుగుతూ ఉంది. పైగా డీఎంకే ప్రభుత్వ అక్రమాలను రాష్ట్ర బీజేపీ నాయకుడు అన్నామలై బహిర్గతం చేయడంతో తమిళ ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి రోజురోజుకు పెరుగుతుంది. దీంతో డీఎంకే పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును నిలుపుకోవాలంటే హిందూ వ్యతిరేకులను సంఘటిత పరచాలనే ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఎందుకంటే భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం ఓ ప్రత్యేక ఉనికితో ఉంటుంది బ్రిటిష్ వాళ్లు ఈ దేశ ప్రజలను విభజించడానికి ప్రవేశపెట్టిన ‘ఆర్య -ద్రావిడ వాద సిద్ధాంతం’ తమిళ ప్రజలపైన బాగా ప్రభావం చూపింది. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు ఉత్తర భారతీయులవనీ ఈ సంస్కృతిని తెలియజేసే హిందీ భాష ఉత్తరాది వారిదని ఒక రకమైన విషప్రచారాన్ని బ్రిటిష్ వారి ప్రభావానికి గురైన హిందూ వ్యతిరేకులైన నాస్తిక వాదులు, హేతువాదులు, డీఎంకే నాయకులు తమిళ ప్రజలకు బాగా నూరి పోశారు. పైగా తమిళనాడులో నిమ్న వర్గాల పట్ల అగ్రకులాలకు చెందిన కొంతమంది ప్రవర్తన జుగుప్సాకరంగా ఉండటంతో హిందూ వ్యతిరేకులకు సనాతన ధర్మం ఆయుధంగా పనిచేస్తుంది. ఉదయనిధి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనువడు. ఆయన కరుడుగట్టిన హిందూ వ్యతిరేకి. పైగా ఆయన నాస్తిక వాది అయిన రామస్వామి పెరియార్ శిష్యుడు. మానవాళికి ఆదర్శ పురుషుడు, పురుషోత్తముడైన శ్రీరాముడి విగ్రహానికి చెప్పుల దండలు వేసి మద్రాసు నగర వీధుల్లో తిప్పిన ఘటికుల్లో కరుణానిధి ఒకరు. రామసేతును తొలగించే విషయంలో రామాయణం ఒక మిథ్య అని ఒకరోజు, ఒక వారం తర్వాత శ్రీరాముడు తాగుబోతు అని కారు కూతలు కూసిన మనిషి కరుణానిధి. అలాంటి వారి కుటుంబం నుండి వచ్చిన ఉదయనిధి అలా కాకుండా ఎలా మాట్లాడతారు?
వందల సంవత్సరాలు ప్రయత్నించినా..
ఇక సనాతన ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నాలను ఆ రాష్ట్రంలో స్టాలిన్ ప్రభుత్వం చాలా చురుకుగానే కొనసాగిస్తోంది. హిందూ సంస్కృతిని అనుసరించే వాళ్లకు ఇబ్బందులు కలిగిస్తే క్రైస్తవులు- ముస్లింలు గుండు గుత్తగా తమ పార్టీ వెంటే ఉంటారని స్టాలిన్‌తో సహా డీఎంకే నాయకులందరూ తలపోస్తున్నారు. ఇక డీఎంకే ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి. ఉదయనిధి వ్యాఖ్యల ప్రభావం రాబోయే ఎన్నికలపై పడుతుందనే ఆలోచన కూడా లేకుండా, భాగస్వామ్య పార్టీలు ఈ విషయంపై గోడమీద పిల్లుల్లాగా ఉండడం బట్టి చూస్తే, ఆ పార్టీల హిందూ వ్యతిరేకత, ధర్మ వ్యతిరేకత, సనాతన ధర్మంపై ఉండే ద్వేషం స్పష్టమవుతుంది. ఇక హిందుత్వ సంస్థలు, బీజేపీ నాయకులు ఇండియా కూటమి నుండి ఉదయనిధి వ్యాఖ్యలపై వివరణ కావాలని కోరడం అమాయకత్వమనిపించలేదా? దేశంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించడం సాధ్యమేనా? అంటే ఈ పవిత్ర భూమిలో సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ముస్లిం పాలకులు, క్రైస్తవులైన బ్రిటిష్ వాళ్ళు ఎనిమిది వందల సంవత్సరాలు ప్రయత్నించి విఫలమయ్యారు. హిందూ వ్యతిరేక, హిందూ వర్గానికి చెందిన కరుణానిధి కుటుంబానికి ఇది సాధ్యమేనా? ధర్మాన్ని ఎవరైనా నాశనం చేయాలని చూస్తే ధర్మం వారిని నాశనం చేస్తుంది. 'ధర్మ ఏవ హతో హన్తి'(ధర్మాన్ని నాశనం చేస్తే అది నిన్ను నాశనం చేస్తుంది) అని చెప్పిన ఋషి వాక్యం ఉండనే ఉంది. ధర్మాన్ని చెరబట్టిన వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారనే విషయం కుర్రవాడైన ఉదయనిధికి తెలియకపోవచ్చు పాపం!
ఉల్లి బాల రంగయ్య,
సామాజిక, రాజకీయ, విశ్లేషకులు
9441737877
- Tags
- Sanatana Dharma