హితవు:చల్లదనానికి సబ్జా గింజలు

by Ravi |   ( Updated:2022-09-03 17:46:15.0  )
హితవు:చల్లదనానికి సబ్జా గింజలు
X

నేటి యువతీయువకులు ఉద్యోగ రీత్యా గంటల కొద్దీ కంప్యూటర్ ముందు కూర్చోవడంతో శారీరక శ్రమ లేక ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఆహారం తీసుకునే ముందు ఒక గ్లాస్ సబ్జా గింజల పానీయం తాగితే కడుపు నిండిన భావనతో తక్కువ ఆహారం భుజించడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన సబ్జా గింజలను నేటి తరం మరచి పోవడం చాలా బాధాకరం. వీటి ప్రయోజనాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలి

వేసవి వచ్చిందంటే చాలు పానీయాలు, రసాలు, సాఫ్ట్ డ్రింక్స్, కృత్రిమంగా తయారు చేసే షర్బత్ పేరుతో రంగు నీళ్లు తాగుతూఉంటాము. కానీ, వీటి వలన ఉపయోగాల కన్నా చెడు ఫలితాలు ఎక్కువ, పైన తెలిపిన వాటి కన్న సబ్జా గింజల పానీయం చాలా మంచిది. గతంలో వేసవి తాపాన్ని తగ్గించుకోవాలనుకుంటే సబ్జా గింజలు నాన బెట్టుకొని వాటిలో పంచదార వేసుకొని తాగేవారు.

ఇప్పుడు పిల్లలు, యువతీయువకులు ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ సేవించడం ఫ్యాషన్ గా మారింది. సబ్జా గింజలు కేవలం శరీరానికి చల్లదనం తో పాటు ఎంతో ఆరోగ్యం చేకూరుస్తాయి. స్థూలకాయం, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాస కోశ వ్యాధులకు చాలా మంచిగా పని చేస్తాయి. సబ్జా గింజలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం మూలాన మలబద్దకం నివారించవచ్చు. శరీరం నుండి మలినాలు తొలగించవచ్చు.

రోగ నివారిణి

రక్త శుద్ధి కడుపు మంట, ఉబ్బరం, ఎసిడిటీ, అజీర్తి వంటి వాటికి గొప్ప ఔషధం. సబ్జా గింజలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వలన మధుమేహం నియంత్రించడంలో సహకారం అందిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. ఈ గింజలు నమలడం కష్టం కనుక వాటిని నీటిలో నానబెట్టి తరువాత నల్లని గింజలు కాస్త మెత్తబడి జెల్లీ గా మారుతాయి, అపుడు నిమ్మకాయ, పంచదార కలిపిన నీటితో తీసుకోవడం ఉత్తమం.

నేటి యువతీయువకులు ఉద్యోగ రీత్యా గంటల కొద్దీ కంప్యూటర్ ముందు కూర్చోవడంతో శారీరక శ్రమ లేక ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఆహారం తీసుకునే ముందు ఒక గ్లాస్ సబ్జా గింజల పానీయం తాగితే కడుపు నిండిన భావనతో తక్కువ ఆహారం భుజించడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన సబ్జా గింజలను నేటి తరం మరచి పోవడం చాలా బాధాకరం. వీటి ప్రయోజనాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలి.

ఎ. వేణుమాధవ్

హైదరాబాద్

86860 51752

Advertisement

Next Story

Most Viewed