- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యారంగ విజయ గాథ సూపర్ 30
ప్రతి మనిషికీ జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ఏదో సాధించాలనే తపన, కోరికలు ఉంటాయి. కాలం గడిచిన కొద్దీ అధిక శాతం మంది జీవితాల్లో అనేకానేక మలుపులు, కుటుంబ వ్యక్తిగత కారణాల వల్ల లక్ష్యాలు చేరుకోలేక ఏదో ఒక చోట స్థిరపడి పోవడం చూస్తాం. అందుకు వారి వారి వ్యక్తిగత ఆర్థిక కారణాలే కాకుండా, సామాజికంగా ఎదురయ్యే ఒత్తిడులు, ఒడిదుడుకులు ముఖ్య కారణమవుతాయి. ప్రముఖ కవి జూకంటి జగన్నాథం అన్నట్టు 'ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' అయిపోయాక కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం దాష్టీకాలు విపరీతంగా పెరిగిపోయాయి. దాదాపు అన్ని రంగాలు కొందరి చెప్పుచేతుల్లోకి చేరిపోయాయి. అట్లా మన దేశంలో విద్యా వైద్య రంగాలు ప్రధానంగా కార్పొరేటికరణ ప్రభావంలో కూరుకుపోయాయి. విద్యారంగ కార్పొరేటీకరణ నేపథ్యంలో బీహార్లో ఆనంద్ కుమార్ 'సూపర్ 30' పేర ఐఐటీ కోచింగ్ సెంటర్ నెలకొల్పి 2003 నుంచి ప్రతి సంవత్సరం 30 మంది పేద విద్యార్థులకు ఫ్రీగా కోచింగ్ ఇస్తూ ఇప్పటి వరకు 400 మంది పేద విద్యార్థులకు ఐఐటీలలో సీట్స్ వచ్చేలా కోచింగ్ ఇచ్చి ఒక మోడల్ గా నిలిచాడు. అలాంటి ఆనంద్ కుమార్ జీవితాన్ని ఆధారం చేసుకొని బయోపిక్‌గా వెండి తెరపైన అద్భుతంగా సూపర్ 30 సినిమా రూపొందించారు.
కథేంటంటే
కథ విషయానికి వస్తే ఆనంద్ కుమార్ బీహార్లో ఓ కింది కులానికి చెందినవాడు. తండ్రి పోస్ట్ మాన్‌గా పనిచేస్తుంటాడు. స్వతహాగా తెలివైన ఆనందకుమార్ దగ్గరలో వున్న నగరానికి వెళ్లి అక్కడ గ్రంథాలయంలో గణిత శాస్త్రానికి చెందిన పుస్తకాలు విపరీతంగా చదువుతూ ఉండేవాడు. కాని అక్కడి మేనేజర్ బయటవాళ్ళకి అనుమతి లేదని పంపించేస్తారు. కాని ఇంకో ఉద్యోగి ఏదైనా పత్రికలో పేరొస్తే పరిస్థితి మారుతుందని సలహా ఇస్తాడు. గణితానికి సంబంధించి ఒక ప్రముఖ పత్రికలో ఆనందకుమార్ వ్యాసం వస్తుంది. తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో చదువుకోవడానికి అవకాశం వచ్చినా ఆర్థిక స్థితి నేపథ్యంలో వెళ్ళలేక పోతాడు. అంతకు ముందు సాయం చేస్తానని ప్రకటించిన మంత్రి స్పందించక పోవడం, ఇంతలో తండ్రి మరణం ఆనంద్ కుమార్‌ను కుంగదీస్తాయి. కుటుంబ పోషణ కోసం అప్పడాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఆనందకుమార్ ప్రతిభను గమనించిన మంత్రి సహాయకుడు లల్లన్ సింగ్ ఎక్స్‌లెంట్ కోచింగ్ సెంటర్‌లో మ్యాథ్స్ అధ్యాపకుడిగా చేర్చుకుంటాడు.
ఆనంద్ ప్రతిభతో సెంటర్‌కి విపరీతమయిన పేరు ప్రవేశాలూ వస్తాయి. ఆనంద్ కష్టాలు గట్టెక్కుతాయి. కాని ఒకరోజు వీధి దీపం కింద చదువుకుంటున్న ఒక విద్యార్థిని గమనించి ఖిన్నుడవుతాడు. 'రాజు కొడుకే రాజు అయ్యే కాలం పోయింది కింది కులాల వాడు కూడా రాజు కావచ్చు' అన్న తండ్రి మాటలు గుర్తొచ్చి, ఎక్స్‌లెంట్ కోచింగ్ సెంటర్‌కు రాజీనామా చేసి తనకున్నదంతా అమ్మేసి సొంతంగా ఉచిత ఐఐటీ కోచింగ్ ఆరంభిస్తాడు. కింది వర్గానికి చెందిన 30 మందిని ఎంపిక చేసి కోచింగ్ ఆరంభిస్తాడు. ఈ పనిలో తల్లి, సోదరుడు ప్రణవ్ వెన్నంటి వుంటారు. కానీ మంత్రి సూచన మేరకు లల్లన్ సింగ్ ఆనంద్ కుమార్ పైన ఆయన కోచింగ్ సెంటర్ పైన అనేక రకాల దాడులకు దిగుతాడు. చివరికి ఆనంద్‌ని చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కాని అకుంఠిత దీక్ష, మొక్కవోని ధైర్యంతో ఆనంద్ కుమార్ నిలబడతాడు. చివరికి ఐఐటీ పరీక్షలో తన సూపర్ 30 విద్యార్థులందరికీ ప్రవేశాలు సాధించి విజేయులుగా నిలబెడతాడు. అలా ఆనంద్ కుమార్ తన లక్ష్యాన్ని చేరుకుంటాడు.
వికాస్ బాల్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ 30లో ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ డీగ్లామరైజ్డ్ పాత్ర పోషించి మంచి నటనను ప్రదర్శించాడు. వాస్తవ కథను కొంత వాస్తవిక చిత్రీకరణ ఆధారంగానే దర్శకుడు రూపొందించాడు. ఇటీవలి కాలంలో బయోపిక్‌లకు ఇచ్చిన ఎలాంటి హైప్ ఇవ్వకుండానే సూపర్ 30 వాణిజ్య పరంగా కూడా 200 కోట్ల మార్కును దాటి విజయవంతమయింది. సూపర్ 30 విషయంలో దర్శకుడు వికాస్ బాల్, హీరో హృతిక్ రోషన్‌లను అభినందించాలి. ఈ సినిమా 'హట్‌స్టార్'లో వుంది చూడండి.
ఇవి కూడా చదవండి : Mahesh Babu సినిమా ఆడిషన్‌కు వెళ్లి చాలా ఏడ్చాను: Sameera Reddy
వారాల ఆనంద్
94405 01281