- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గొప్ప త్యాగమూర్తి రమాబాయి అంబేద్కర్

ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక, ఒక స్త్రీ ఉంటుంది. అంబేడ్కర్ జీవితంలోనూ ఆయన భార్య రమాబాయి ఆయనను బాగా ప్రభావితం చేసింది. విదేశాలలో ఉన్నత విద్యను పొందే సమయంలో అంబేడ్కర్‌కు ఆమె చాలా సహాయపడింది. బాబాసాహెబ్ చదువు కోసం విదేశాలకు వెళ్లినప్పుడు, రమాబాయి అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ ఆయన తన లక్ష్యాల నుండి దృష్టి మరల్చకుండా చూసుకుంది.
మహారాష్ట్రలోని దభోల్ అనే చిన్న గ్రామంలో జన్మించిన రమాబాయిని రామాయ్ లేదా మాతా రమాబాయి అని పిలుస్తారు. ఫిబ్రవరి 7, 1898న ఆమె ఒక నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. ఆమె 15 సంవత్సరాల వయసులో బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను వివాహం చేసుకున్నారు. రమాబాయి లాంటి చాలా విధేయతగల జీవిత భాగస్వామిని పొందిన బాబాసాహెబ్ అదృష్టవంతుడు. అంబేడ్కర్ విదేశాల్లో చదువుతున్నప్పుడు తన జీవితంలో చాలా కాలం పాటు ఇంటిని నడిపించే బాధ్యతను రమాబాయి తన భుజస్కందాలపై వేసుకున్నారు. అంబేడ్కర్ విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా సమాజంలో మార్పు తేవాలన్న ఏ చర్యను వ్యతిరేకించలేదు. అతను సామాజిక సేవలో ఎంతగా మునిగిపోయాడంటే, రమాబాయికి రోజుకు అరగంట కూడా దొరకనంతగా.అయినా ఏనాడూ ఆమె అంబేడ్కర్ లక్ష్యాలకు అడ్డురాలేదు. అందుకే గొప్ప త్యాగమూర్తి రమాబాయి అంబేడ్కర్. భారత రాజ్యాంగాన్ని రూపొందించే కమిటీకి నాయకత్వం వహించిన భారతీయ న్యాయవాది, ఆర్థికవేత్త, సామాజిక సంస్కర్త, రాజకీయ నాయకుడుగా ఆయనను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. సామాజిక న్యాయం, సంస్కరణల కోసం ఆయన చేసిన ప్రయత్నాలకు కూడా ఆమె మద్దతు ఇచ్చింది. అందుకే అంబేడ్కర్ తన "థాట్స్ ఆన్ పాకిస్తాన్" పుస్తకాన్ని తన ప్రియమైన భార్యకు అంకితం చేశారు. రమాబాయి తన భర్త చేపట్టిన పోరా టాన్ని చేపట్టి, ఆయన ప్రారంభించిన గొప్ప పనిని నిర్వహించడానికి అతనితో పాటు ఒక శిలలా నిలబడింది.
(నేడు మాతా రమాబాయి జయంతి సందర్భంగా...)
తీగల అశోక్ కుమార్
ఎస్సీ సంక్షేమ సంఘంరాష్ట్ర అధ్యక్షులు
9666634001