- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాయాదిని తరిమికొట్టిన విజయం!
ఎండలకి, వానలకి, మంచు గాలులకి లెక్క చేయకుండా వారి కుటుంబాలను కూడా మరచి, కేవలం దేశ రక్షణనే భుజానికెత్తుకున్న వీరులే సైనికులు. వీరు భరతమాత ముద్దు బిడ్డలు. అటువంటి ఎంతో మంది వీరులు 1999 కార్గిల్ యుద్ధంలో పోరాట పటిమతో, ప్రాణాలను పణంగా పెట్టి పాకిస్థాన్ ముష్కరులను వెంటాడి తరిమి తరిమి, కొట్టి మన దేశ పతాకాన్ని రెపరెప లాడించిన రోజే జూలై 26. కార్గిల్ యుద్ధంలో భాగంగా పాకిస్థాన్ సైన్యం ఆక్రమించిన పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్న రోజు. ఈ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం జులై 26 న కార్గిల్ విజయ్ దివాస్‌ని యావత్ దేశ ప్రజలూ జరుపుకుంటారు. వీర మరణం పొందిన సైనికులకు నివాళులు అర్పిస్తారు. యుద్ద వీరులను సత్కరించి దేశానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకుంటారు. దేశ సరిహద్దులను రక్షించే వీర సైనికులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. కార్గిల్ విజయ్ దివాస్ సిల్వర్ జూబ్లిని పురస్కరించుకొని , 26 జూలై 2023 నుండి ప్రారంభం అయ్యి ఏడాది పొడవునా ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం జరుపుకుంటారు.
ఈ యుద్ధంలో..
ఒక్కసారి అప్పుడు ఏమి జరిగిందో గుర్తుకు తెచ్చుకుందాం. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం తరువాత మొదటిసారిగా రెండు దేశాలు నేరుగా సైనిక ఘర్షణకు దిగిన యుద్ధంగా ఇది నిలిచింది. అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి 1998 లో అణు పరీక్షలు జరిపారు. మే 3, 1999 న పాకిస్థాన్ దళాలు, ఉగ్రవాదులు భారత నియంత్రణలో ఉన్న కార్గిల్ భూభాగంలోకి చొరబడ్డారనే సమాచారంతో భారత సైన్యం అప్రమత్తమైంది. మే 10 న భారత సైన్యం ఆపరేషన్ విజయ్ ప్రారంభించింది. మే 31న వాజపేయి గారు కార్గిల్‌లో ఇది యుద్ధం లాంటి పరిస్థితి అని ప్రకటించారు. ఈ యుద్ధం సుమారు 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రదేశాల్లో కొనసాగింది. అత్యంత సవాలుగా ఉండే భూభాగంలో జరిగిన సమరాల్లో ఒకటిగా నిలిచింది. జూన్ 5న పాకిస్తాన్ ప్రమేయాన్ని వెల్లడించే పత్రాలను మన సైన్యం విడుదల చేసింది. జూన్ 9 న బటాలిక్ సెక్టార్ లోని ముఖ్యమైన రెండు స్థావరాలను మన సైన్యం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి మరో నాలుగు రోజులలోనే టోలోలింగ్ శిఖరాన్ని మన దేశం తిరిగిపొందింది. అప్పటి ప్రధాన మంత్రి కార్గిల్‌ను సందర్శించారు. జూలై 11 నాడు పాకిస్థాన్ దళాలు తోకముడిచి పారిపోయాయి. బటాలిక్ లోని మన ప్రాంతాలను మన సైన్యం స్వాధీనం చేసుకుంది. జూలై 14 నాడు ఆపరేషన్ విజయ్ విజయవంతం అయినదని మన సైన్యం ప్రకటించింది.
ఈ యుద్ధంలో ఫిరంగి దళం, వైమానిక శక్తి మరియు పదాతి దళ కార్యకలాపాలను విస్తృతంగా ఉపయోగించారు. భారత వైమానిక దళం సంఘర్షణ సమయంలో వైమానిక సహాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది, వ్యూహాత్మక స్థానాల నుండి శత్రువును తరిమికొట్టడానికి కీలకమైన వైమానిక దాడులు నిర్వహించింది. యుద్ధ సమయంలో భారత సైన్యం టోలోలింగ్, టైగర్ హిల్ మరియు పాయింట్ 4875 వంటి వ్యూహాత్మక శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. భారత ఆర్మీ అధికారి అయిన కెప్టెన్ విక్రమ్ బాత్రా, యుద్ధ సమయంలో తన ధైర్యసాహసాలు, సాహసోపేతమైన చర్యలకు గాను జాతీయ హీరో అయ్యాడు. అతని ప్రసిద్ధ పదాలు, యే దిల్ మాంగే మోర్, ఐకానిక్‌గా మారాయి. జూలై 26 నాటికి కార్గిల్ యుద్ధం ముగిసింది.
(నేడు కార్గిల్ దివస్)
డి జె మోహన రావు
94404 85824