- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లేఖ:పేపర్-3 నిర్వహించాలి
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, అందులో ఎస్‌జీటీవారి కోసం పేపర్-1, స్కూల్ అసిస్టెంట్ల కోసం పేపర్-2 నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష విధానం వలన తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండిత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. లాంగ్వేజ్ పండిట్‌ల కోసం మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేపర్-3 నిర్వహిస్తున్నది. అదే విధానాన్ని మన తెలంగాణలోనూ అవలంబించాలి. లాంగ్వేజ్ పండిట్ పేపర్-2 ను రాయడం వలన ఇబ్బందులు ఉంటాయి. ఈ పేపర్‌లో పండిట్‌లకు సంబంధం లేని సోషల్, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించి 60 మార్కులు ఉంటాయి. దీంతో టెట్‌లో క్వాలిఫై కాలేకపోతున్నామని భాషా పండితులు ఆందోళన చెందుతున్నారు. అందుకే తమ కోసం పేపర్-3 నిర్వహించాలని కోరుతున్నారు.
కేంద్ర నిబంధనల కారణంగా
ఎన్‌సీఆర్‌టీ నిబంధనల లోపము వలన ప్రతిసారీ టెట్‌లో భాషా పండితులకు నష్టం జరుగుతున్నది. టెట్‌లో అర్హత సాధించిన తరువాత టీచర్ ఉద్యోగం వస్తే భాషా పండితులు వారికి ఇచ్చిన లాంగ్వేజ్‌లు మాత్రమే బోధించాలి. అలాంటప్పుడు ఈ నియమాలు అన్నీ అభ్యర్థులను ఇబ్బందులు పెట్టడానికేనని విమర్శలు ఉన్నాయి. టెట్ ప్రారంభమైనప్పటి నుండి భాషా పండితులు సోషల్ కంటెంట్ & మెథడాలజీ రాయాల్సి వస్తుంది. దీనివలన తాము ఎక్కువ మార్కులు స్కోరు చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. అందువలన సంబంధిత లాంగ్వేజ్ సబ్జెక్టుకు 90 మార్కులు, పెడగాజీకి 30 మార్కులు, ఇంగ్లిష్ కి 30 మార్కులు కేటాయించాలని కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ప్రాంతీయతను, రాష్ట్రాల భాషను పట్టించుకోకుండా ఎన్‌సీఆర్‌టీ నిబంధనలు అమలు చేయడం వలన ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని కావున ఈ సమస్యను త్వరగా పరిష్కరించి భాషా పండితుల కోసం పేపర్-3 ను నిర్వహించాలని కోరుతున్నాము. ముఖ్యమంత్రి భాషాభిమాని. ఆయన భాషా పండిట్‌నేని గుర్తెరిగి లాంగ్వేజ్ పండిట్‌లపై అభిమానంతో వారికి న్యాయం చేకూర్చాలి. ఇప్పటికే ఒకసారి టెట్ రాసి క్వాలిఫై అయితే జీవితకాలం పాటు వర్తిస్తుందని ప్రభుత్వం తెలియజేయడంతో అందరూ ఈసారి తమ ప్రతిభను పరీక్షించుకోవాలని ఆరాటపడుతున్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే టెట్‌లో భాషా పండితుల కోసం ప్రత్యేకంగా పేపర్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
కాళేశ్వరం కృష్ణమూర్తి,
హన్మకొండ
97051 96097
దేవులపల్లి రమేశ్
నంగునూరు. సిద్దిపేట
9963701294