- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
2019లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని చీల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో శివసేన- కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి నుంచి శివసేనను చీల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రజలలో వ్యతిరేకత వస్తుందని గమనించి బయటి నుంచి మద్దతు ఇస్తామంటూనే, చివరి నిమిషంలో షిండేను సీఎం చేసి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉపముఖ్యమంత్రిగా నియమించుకుంది. బయట నుంచి మద్దతు ఇస్తామన్నవారు ప్రభుత్వంలో ఎందుకు భాగస్వాములయ్యారో వారే సమాధానం చెప్పాలి. ఇవాళ బీజేపీ రాజకీయాలను గమనిస్తే 'ఆవు ఏ కొట్టంలో ఈనినా దూడ మాదే, కొట్టం మాదే' అన్నట్టుగా ఉంది.
'ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే' ఎన్నుకునేది ప్రజాస్వామ్య ప్రభుత్వం. కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించడం వలన ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ, 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూల్చుతూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నది. రాజ్యాంగం ద్వారా ప్రజలు తమకు నచ్చిన నేతను ఎన్నుకుంటారు. మెజారిటీ ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మెజారిటీ లేకుంటే స్వతంత్రంగా గెలిచిన అభ్యర్థులు, లేదా ఏదైనా పార్టీ మద్దతు తీసుకుంటుంది. బీజేపీ మాత్రం ప్రజలు మెచ్చిన మెజారిటీ ప్రభుత్వాలను మధ్యంతరంగా కూల్చుతోంది. ఎమ్మెల్యేలను నయానో భయానో బెదిరించి, అంగడిలో సరుకులను కొన్నట్టు కొంటూ తన ప్రభుత్వాలను ఏర్పరుస్తున్నది. రాజ్యాంగ ప్రాథమిక నియమాలను ఉల్లంఘిస్తున్నది.
2019లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని చీల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో శివసేన- కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి నుంచి శివసేనను చీల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రజలలో వ్యతిరేకత వస్తుందని గమనించి బయటి నుంచి మద్దతు ఇస్తామంటూనే, చివరి నిమిషంలో షిండేను సీఎం చేసి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉపముఖ్యమంత్రిగా నియమించుకుంది. బయట నుంచి మద్దతు ఇస్తామన్నవారు ప్రభుత్వంలో ఎందుకు భాగస్వాములయ్యారో వారే సమాధానం చెప్పాలి. ఇవాళ బీజేపీ రాజకీయాలను గమనిస్తే 'ఆవు ఏ కొట్టంలో ఈనినా దూడ మాదే, కొట్టం మాదే' అన్నట్టుగా ఉంది. 'ఇక తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం' అంటూ బీరాలు పలుకుతున్నది. రాజకీయ సంక్షోభం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నది.
వారి ప్రోద్బలంతోనే
దేశంలో రెండో సారి పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన బలంతో ఎన్నో వివాదాస్పద చట్టాలను రూపొందించింది. జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేసింది. అక్కడి ప్రజలను, రాజకీయ నాయకులను సుమారు రెండు సంవత్సరాల పాటు నిర్బంధించి ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలు చేపడుతూ అప్రజాస్వామికంగా వ్యవహరించింది. వ్యవసాయంలో కార్పొరేట్లను ప్రవేశపెట్టేందుకు విఫలయత్నాలు చేస్తున్నది. దేశ రక్షణ బాధ్యత వహించే సైనిక వ్యవస్థలో కాంట్రాక్ట్ పద్ధతిన అగ్నిపథ్ పథకం పేరుతో అగ్నివీరులను నియమించాలని అనుకుంటున్నది. ఈ పనులన్నీ దేశంలో ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో దేశ సంపద బూడిదైంది.
ఆర్టికల్ 25 ప్రకారం ప్రతీ పౌరుడు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది. కానీ, బీజేపీ ఇతర మతస్తుల మీద విచక్షణారహితంగా దాడులు చేస్తున్నది. వారి ఆహారం మీదా, వస్త్రధారణ మీదా ఆంక్షలు విధిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నది. వీటన్నింటికీ బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే కారణమనే ఆరోపణలున్నాయి. ఎందుకంటే, వారు బహిరంగంగానే చాలా సందర్భాలలో 'రాజ్యాంగాన్ని మారుస్తాం' అనే వ్యాఖ్యలు చేశారు. వారిపై కనీసం క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడంపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తరుణంలో పౌరసమాజం, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు ప్రజాస్వామికవాదులు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలి.
బాలసాని లెనిన్
ఏఐఎస్‌ఎఫ్ స్టేట్ ఈసీ మెంబర్
95027 26430