వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం

by Ravi |   ( Updated:2024-02-08 01:00:22.0  )
వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం
X

మూడు దశాబ్దాలుగా సామాజిక అణచివేతకు గురవుతున్న మాదిగలను ఇప్పుడు పార్టీలకు ఓటు బ్యాంకుగా చేసుకున్నారు. కమిటీల పేరుతో మాదిగలను మభ్యపెట్టే ప్రయత్నం బలంగా జరుగుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ కమిటీని వేశారు. గతంలో కమిటీలు ఇచ్చిన నివేదికను అమలు చేసి పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగల, ఉపకులాల ఆకాంక్షను నెరవేర్చవచ్చు. కానీ అలా చేయలేదు.

దేశం ఆధునికంగా దూసుకుపోతున్నప్పటికీ... దళితుల జీవితాల్లో ఎటువంటి మార్పు రావడం లేదు. ఫలితంగా ఇంకా సామాజిక అసమానతలకు దూరమై విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనుకబాటుకే గురవుతున్నారు. అందులో ప్రధానంగా మాదిగలు మూడు దశాబ్దాలుగా సామాజిక అణచివేతకు గురవుతున్నారు. మాదిగలను ఇప్పుడు పార్టీలకు ఓటు బ్యాంకుగా చేసుకున్నారు. వారి ఆశను సాకుగా చూపుతూ అందలం ఎక్కుతున్నారు. అందులో భాగంగా కమిటీల పేరుతో మాదిగలను మభ్యపెట్టే ప్రయత్నం బలంగా జరుగుతోంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ కమిటీని వేశారు. గతంలో కమిటీలు ఇచ్చిన నివేదికను అమలు చేసి పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగల, ఉపకులాల ఆకాంక్షను నెరవేర్చవచ్చు. కానీ అలా చేయలేదు అంటే.. నరేంద్ర మోడీ సర్కార్ మరోసారి మాదిగలను ఆశల్లో ముంచి ఓట్లు రాబట్టుకోవాలనే కపటనీతిని ప్రదర్శిస్తుందని చెప్పక తప్పదు.

వంద రోజుల్లో వర్గీకరణ.. ఏది?

కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2014లో తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. పదేళ్లు గడుస్తున్నా.. ఆ దిశగా కనీస చర్చకు పార్లమెంటులో రాకపోవడం మాదిగ, ఇతర షెడ్యూల్డ్ కులాల ఉపకులాలకు పెద్ద మోసమే జరుగుతుంది. ఈ వర్గాలకు రిజర్వేషన్లు సరైన జనాభాకు తగ్గట్టుగా అందకపోవడంతో మెజారిటీ వర్గంగా ఉన్న మాదిగ, మాదిగ ఉపకులాలు ఇంకా రిజర్వేషన్ల ఫలాలు సరిగా అందలేకపోతున్నాయి. ఇప్పటికే అనేక సంచార జాతులు అంతరించిపోయాయి. అయినప్పటికీ మాదిగల ఆవేదనను మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఎస్సీల్లో 59 ఉపకులాలు ఉండగా అందులో ఎస్సీ- ఏలో రెల్లి, ఎస్సీ- బీలో మాదిగ, మాదిగ ఉపకులాలు, ఎస్సీ- సీలో మాల, ఉపకులాలు, ఎస్సీ- డీలో ఆది ఆంధ్ర ద్రవిడులు ఉంటారు. కాగా తెలంగాణలో మాల, మాదిగలు వాటి ఉపకులాల వారే అధికంగా ఉంటారు.

ఇటీవల భారత ప్రభుత్వం యక్షగానం కళను ప్రోత్సహిస్తూ గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీతో సత్కరించింది.. కానీ అటువంటి అనేక మంది సంచార ఉపకులాల పరిస్థితి అధ్వానంగా ఉంది. రోజు రోజుకు ఈ ఉపకులాలు అంతరించిపోతున్నాయి. వర్గీకరణ కాకపోవడం, ఉపకులాల వాటా వారికి తగ్గట్టు దక్కకపోవడం వల్ల వారి అస్తిత్వం కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.

న్యాయం జరిగేది అప్పుడే!

తెలంగాణలో వర్గీకరణ ఉద్యమం అలుపు లేకుండా సాగుతుంది. దీనికై పోరాడిన నాయకులు అక్రమ కేసులకు బలైన వెనకడుగు వేయలేదు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి అలసత్వం వహిస్తున్న బీజేపీ తీరును ఎండగడుతూ దళిత, మాదిగ, ఉపకులాల్లో చైతన్యం కల్పిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ లెక్కల ప్రకారం దళితుల నిష్పత్తి 20 శాతానికి చేరింది. కాగా అందులో మాదిగల జనాభా 12 శాతానికి చేరింది. ఈ విషయమై అలుపెరగని పోరాటాన్ని సాగిస్తున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మాదిగల, ఉపకులాల భవిష్యత్తు కోసం వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి.

తెలంగాణలో మాదిగలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదనే భావన అనేక మంది మాదిగ జాతి బిడ్డల్లో వ్యక్తమవుతున్నది. నిత్యం మాదిగల కోసం, సామాజిక సమానత్వం కోసం అవిశ్రాంతంగా కృషి చేసే వారిని చట్టసభల్లోకి పంపాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వారిని భాగస్వామిని చేసే అవకాశం కల్పిస్తే ...తెలంగాణలోని మాదిగ సామాజిక వర్గం అంతా ఆ నాయకుడి వెంట నడిచే అవకాశం ఉంది. ఇప్పటికైనా సామాజిక ఆకాంక్షలతో పాటు..ఉద్యమ కారులను గుర్తించి అవకాశం ఇవ్వాలి.

సంపత్ గడ్డం

78933 03516

Advertisement

Next Story

Most Viewed