- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రియల్ రిపోర్ట్:111 జీఓ రద్దు సాధ్యమేనా?
111 జీఓ ఎత్తి వేసిన పక్షంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు అనూహ్యంగా పెరుగుతాయి. కొత్త నిర్మాణాలు వస్తాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లోకి చేరే దారి లేక లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతుంది. చిన్నపాటి వానలకే నగరం అతలాకుతలమైన సంఘటనలు కోకొల్లలుగా చూశాం. స్వచ్ఛమైన తాగునీరు కరువైపోతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. భూగర్భ జలాలు అడుగంటి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతంగా కాలుష్యం పెరిగిపోయి జనానికి హాని కలుగుతుంది. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జలాల తరలింపునకు అయ్యే ఖర్చు కంటే నగరాన్ని అనుకొని ఉన్న ఈ జలాశయాల ద్వారా తక్కువ ఖర్చుతో నీటి అవసరాలను సమూలంగా తీర్చే అవకాశం ఉంది.
సీఎం కేసీఆర్ ఏది చేసినా సంచలనంగానే ఉంటుంది. 111 జీఓ ఎత్తివేస్తామని ఆయన అసెంబ్లీలో ఇలా ప్రకటించారో లేదో ఆ జీఓ పరిధిలోకి వచ్చే గ్రామాలలో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ హడావుడి షురూ అయ్యింది. జంట నగరాలుగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ దాహార్తిని తీర్చడానికి జంట జలాశయాలుగా ఉన్న ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ దశాబ్దాలకాలంగా ఉపయోగపడుతున్నాయి. ఎలాంటి టెక్నాలజీ అవసరం లేకుండానే, కేవలం ఇంజనీర్ల నైపుణ్యం ద్వారా నీటి సరఫరా సజావుగా సాగుతోంది.
జంట జలాశయాలు నిండాయాంటే నగరవాసుల కండ్లలో కాంతులు నిండుతాయి.నీటి సమస్య ఉండదని సంబరపడిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితులలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 1996 నాటికే విపరీతంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ తాగునీటి అవసరాలను అంచనా వేసిన ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ముందుచూపుతో ఈ జీఓను తీసుకువచ్చింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా వరద నీరు సులువుగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలకు చేరేలా చేయడమే ఈ జీఓ ముఖ్య ఉద్దేశ్యం. కాలుష్య కారక వ్యర్థాలను నివారించడానికి, పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య కారక పరిశ్రమలు, భవనాల నిర్మాణాలు లేకుండా ఉండడానికి జలాశయాలకు ఎగువన పది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మొయినాబాద్, శంషాబాద్, శంకర్‌పల్లి కొత్తూరు, షాబాద్ మండలాలోని 84 నాలుగు గ్రామాలను ఈ జీఓ కిందకు తెచ్చారు,
సర్కారు నిర్లక్ష్యంతో
నిజాం కోరిక మేరకు హైదరాబాద్ నగరానికి మూసీ వరదల నుంచి ముప్పును నివారించేందుకు 1908లో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలకు రూపకల్పన చేశారు. హైదరాబాద్ నగరానికి సజావుగా తాగునీటిని అందించేలా అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రణాళికను అందించారు. ఇతర అన్ని నగరాల కంటే హైదరాబాద్ నగరంలో విభిన్న వాతావరణం ఉంటుంది. ఈ క్రమంలో తాగునీరు కలుషితము కాకుండా ఉండడానికి, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు 111 జీఓకు నాటి ప్రభుత్వాలు జీవం పోశాయి.
జీఓ పరిధిలోని ప్రాంతాలలో వ్యవసాయ రంగానికి మినహా ఏ ఇతర అవసరాల కోసం కూడా భూమిని కేటాయించడానికి వీలు లేదు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలలో రసాయనాలు, క్రిమిసంహారక స్థాయిలను ప్రత్యేక ఏజెన్సీల ద్వారా లెక్కించాలి. జి-ప్లస్ 2 కు మించి కట్టడాలు నిర్మించేందుకు అనుమతులు ఉండవు. క్యాచ్‌మెంట్ పరిధిలో వేసే లే-అవుట్లలో 60 శాతం ఓపెన్ స్థలాలు రోడ్లకు వదలాలి. వినియోగించే భూమిలో 90 శాతం కన్జర్వేషన్ కొరకు కచ్చితంగా కేటాయించాలి. జీఓ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎన్నో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
ఎవరి చేతులలో ఎంతెంత?
ప్రస్తుతం అక్కడ దాదాపు 70 శాతం భూములు రాజకీయ నేతలు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేతులలోనే ఉంది. సీఎం కేసీఆర్ చెప్పినట్టు ఈ జీఓ పరిధిలో ఒక లక్షా 32 వేల ఎకరాల భూములు ఉండగా, అందులో 80 వేల ఎకరాలకు పైగా లీడర్లు, బడాబాబుల చేతులలోనే ఉన్నట్లు అంచనా. రైతుల వద్ద 40 వేల ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. మూడెకరాల నుంచి ఐదెకరాల కమతాలు మధ్యతరగతి చేతులలో ఉన్నాయి. బడా బాబుల వద్దనే అధిక భూమి ఉండటంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిపోతున్నది. నాడు తక్కువ రేట్లకే రైతుల నుంచి భూములను కొనుగోలు చేశారు. ఇప్పుడు సీఎం ప్రకటనతో లక్షలు, కోట్లు చేతులు మారే అవకాశం ఉంది గతంలో ఎకరానికి రూ.10 లక్షలు పలికిన భూములు నేడు రూ.10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పైగా పలకడం ఆశ్చర్యమేస్తుంది కదా! కానీ, ఇది వాస్తవం.
ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు, ప్రపంచస్థాయి పారిశ్రామిక అధిపతులు, ఫార్మా కంపెనీల దృష్టి హైదరాబాద్ మీద ఉంది. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ప్రధాన కేంద్రాలను ఇక్కడ నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత సురక్షిత, అన్ని వాతావరణాలను తట్టుకునే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ పేరు తెచ్చుకున్నది. ప్రపంచస్థాయి నగరం కావడానికి ఎంతో కాలం పట్టదు. ఈ విషయం ప్రభుత్వాధినేతలకు తెలియనిదేమీ కాదు. దీనిని మహా విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని అంటూనే, పర్యావరణ సమతుల్యతకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా గత పాలకులు చేసిన నిర్మించిన అద్భుత పథకాలకు అవరోధం కలిగించడాన్ని చారిత్రక తప్పిదంగా భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటారు.
రద్దు చేయడం సాధ్యమేనా ?
111 జీఓ ఎత్తి వేసిన పక్షంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు అనూహ్యంగా పెరుగుతాయి. కొత్త నిర్మాణాలు వస్తాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లోకి చేరే దారి లేక లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతుంది. చిన్నపాటి వానలకే నగరం అతలాకుతలమైన సంఘటనలు కోకొల్లలుగా చూశాం. స్వచ్ఛమైన తాగునీరు కరువైపోతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. భూగర్భ జలాలు అడుగంటి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతంగా కాలుష్యం పెరిగిపోయి జనానికి హాని కలుగుతుంది.
వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జలాల తరలింపునకు అయ్యే ఖర్చు కంటే నగరాన్ని అనుకొని ఉన్న ఈ జలాశయాల ద్వారా తక్కువ ఖర్చుతో నీటి అవసరాలను సమూలంగా తీర్చే అవకాశం ఉంది. నిజానికి 111 జీఓను రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టు ప్రికాషనరీ సర్కారుకు లేదు. చేస్తే ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు రద్దు చేస్తుంది. ప్రజల అభిప్రాయాలతో పాటు, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారో సుప్రీంకోర్టు ముందుంచాలి. పర్యావరణ శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంఘాలు, పర్యావరణ ప్రేమికులు జీఓ రద్దును నిలువరిస్తామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
డా. బి. కేశవులు, ఎండీ
రాజకీయ విశ్లేషకులు
85010 61659