- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ పరిస్థితి మెరుగయ్యేనా?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనే సామెతకు సరైన ఉదాహరణ కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి తన మద్దతుదారులతో కలిసి తెలుగుదేశంలో చేరడం. విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎంతో అనుభవం ఉన్నా నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2004 నుంచి 2014 వరకు మంత్రిగానూ సేవలందించిన ఆయన ఇప్పుడు టీడీపీలో చేరడం రాష్ట్రంలో బలంగా ఎదగాలనుకున్న బీజేపీకి పెద్దనష్టంగానే భావించవచ్చు.
అధ్యక్షుడిని మారుస్తారా?
రాష్ట్ర బీజేపీలో పంచాయతీ పతాక స్థాయికి చేరుకుంది. కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడే సమయంలో, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఆయన పార్టీని సొంత పార్టీలా నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పార్టీలో నేను ఇమడలేకపోతున్నానని అందుకే బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని వ్యాఖ్యానించడం, అలాగే లోకల్ నాయకులు అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి పార్టీని తప్పుదోవ పట్టించారని, అలాగే రాష్ట్రంలో బలపడుతున్న జనసేనాని పవన్ కళ్యాన్‌ను కలుపుకోకుపోవడంలో కార్యాచరణ సరిగ్గా లేదని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ పార్టీ పెద్దలను ఆలోచనలో పడేశాయి. కన్నా రాజీనామాతో రాష్ట్రంలో బీజేపీ పరిణామాలు మారిపోయాయి. కన్నా పార్టీని వీడిన తర్వాత సోము వీర్రాజుకు వ్యతిరేకమైన బీజేపీ వర్గమంతా ఒకటై ఢిల్లీలో ఏపీ బీజేపీ ఇంఛార్జ్ మురళీధరన్‌తో సమావేశమై వాళ్ళగోడును వినిపించారు. ఈ సమావేశాన్ని రాష్ట్రంలో నిర్వహించాలని భావించినా ఢిల్లీ అధిష్టానం వారిని అక్కడికే పిలిపించుకొని క్షేత్రస్థాయి పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చారు. అయితే ఈ సమావేశం తర్వాత సోము వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి మార్చవచ్చేమోననే చర్చ సాగుతుంది. రాష్ట్రంలో పొత్తు విషయంలో సోము వీర్రాజు వ్యవహారశైలి, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని అందుకే కన్నా లక్ష్మీనారాయణను సోము వీర్రాజు టార్గెట్ చేశాడని అది తట్టుకోలేని కన్నా పార్టీకి రాజీనామా చేశాడని చెబుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా సోము వీర్రాజు పదవికి ఎసరు తెస్తుందా? లేదా అనేది ఏపీ బీజేపీలో వ్యవస్థాగత మార్పుకి చిరునామాగా మారనుందని కమలదళాన్ని కలవరానికి గురిచేస్తుంది.
నాయకత్వ లేమితో సతమతం..
అయితే ప్రస్తుత పరిణామాలు ఇంకా కొలిక్కిరాని పొత్తులు నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి జాబితాలో తమ పేరు ఉంటుందా లేదా అనే ఆందోళనలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నారు. ఇప్పటికే అప్పటి టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్‌లు బీజేపీలో చేరారు. ఇప్పుడు వారి పదవీకాలం ముగింపు దశలో ఉంది. వారికి బీజేపీ మరోసారి రాజ్యసభ అవకాశం కనిపించడం లేదు. ఢిల్లీ స్థాయిలో ఎంత లాబీయింగ్ చేసినా ఫలితం కనిపించడం లేదు. అధినాయకత్వం నుంచి సానుకూలత లేదు. ఈ నేపథ్యంలో టీజీ వెంకటేష్, సుజనా చౌదరీలు టీడీపీ గూటిలోకి చేరతారన్న ప్రచారం జరుగుతుంది. సీఎం రమేష్‌కు మరికొంత కాలం రాజ్యసభ పదవి ఉండటంతో ఆయన ఇప్పుడిప్పుడే బీజేపీకి రాజీనామా చేయకపోవచ్చు. వీరిద్దరితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన మరికొందరు నేతలతో పాటు అనంతపురం, కడప జిల్లాలకు చెందిన నేతలు కూడా రేపో మాపో టీడీపీలో చేరనున్నారని తెలిసింది. అలాగే మాజీ మంత్రి ఎమ్మెల్యే కూడా పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోతున్నారని చెబుతున్నారు.
అయితే రాష్ట్రంలో బీజేపీ పార్టీ అంత చురుకుగా లేదు. నాయకత్వ లేమితో సతమతమవుతోంది. ప్రభావవంతమైన నాయకుడి కోసం అధిష్టానం చూస్తోంది. ప్రస్తుతమున్న నాయకులు అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెట్టడం తప్ప కార్యాచరణపై దృష్టి పెట్టడం లేదు. పార్టీలో దగ్గుబాటి పురంధేశ్వరి లాంటి అనుభవమున్న వారు ఉన్నా, వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు. వారు పార్టీ పరంగా మంచి హోదాలోనే ఉన్నప్పటికీ భవిష్యత్తులో పదవులు పొందాలంటే ఇప్పటికిప్పుడు బీజేపీ నుంచి అంత ఈజీ కాదు. దీనికి తోడు కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఆ పార్టీ నేతలకు శరాఘాతమే. పొత్తులపై ఆశలతో ఊహాజనిత ఆశావహ ధోరణిలో వుంది. పొత్తులు అటూ ఇటూ అయితే బీజేపీ సాధించే సీట్లు తక్కువ. కాబట్టి ఇప్పటికైనా పార్టీ పరిస్థితి పై శ్రద్ధ పెట్టి నాయకులను సమన్వయ పరచి అనుభవమున్న వారి సేవలను వినియోగించుకుని మహిళలకు, యువతకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా సర్దుబాటు చర్యలు తగిన మరమ్మత్తులు చేయాల్సిన అవసరం వుంది. ఒంటెత్తు పోకడతో వచ్చిన అవకాశాన్ని జార విరుచుకునే రీతిలో ప్రవర్తన చేయకూడదు. గ్రామీణ ప్రాంతంలో పట్టులేకపోవడం. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న పార్టీ అన్న మేకపోతు గాంభీర్యంతో వుంది. రాష్ట్ర స్థాయిలో ప్రస్తుతమున్న పరిణామాల దృష్ట్యా స్థానిక పరిస్థితుల దృష్ట్యా సరైన కసరత్తు చేయాలి. లేకపోతే తగిన ఫలితాలు రావు.
శ్రీధర్ వాడవల్లి
99898 55445