- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
33 ఏళ్ల శిక్ష సరిపోదా.. వాళ్లను ఇప్పటికీ క్షమించలేమా?

1993 మార్చి నెలలో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనం ఘటనలో జీవిత శిక్ష అనుభవిస్తున్న సాతులూరి చలపతిరావు, గంటెల విజయవర్ధనరావుల విడుదల గురించి చలపతిరావు కుమార్తె స్వప్న దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల తొమ్మిదో తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో ముప్పై రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ జైళ్లలో ఉంటూ వస్తున్న చలపతి విజయవర్ధనరావుల విడుదలకు సంబంధించి చట్టపరమైన అవకాశాలు పరిశీలించి వారి విడుదలకు దోహదపడే నిర్ణయం తీసుకోవల్సిందిగా ప్రభుత్వానికి జైళ్ల శాఖ వారికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పు వెలువడడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం జీవిత ఖైదీల విడుదలకు మార్గదర్శకాలు రూపొందించి ఈ నెల పదిహేడో తేదీన జీవో నంబర్ 71 విడుదల చేసింది. అయితే ఈ జీవోలో ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు చలపతి విజయవర్ధనరావుల విడుద లకు అవకాశం కల్పించే విధంగా లేవు. ఈ తీర్పు కన్నా చాలా ముందునుంచే ప్రభుత్వం ఈ మార్గ దర్శకాల రూపకల్పనకు కసరత్తులు జరిపి విడుదల చేసిన ఈ జీవోలో ప్రకటించిన అంశాలన్నీ గత జీవోల్లో ఉంటూ వస్తున్నవే. వాటిని సవరించాలనే చలపతిరావు కుమార్తె కోర్టును ఆశ్రయించింది.
అందుకే హైకోర్టు తీర్పు వెలుగులో ప్రత్యేక జీవో జారీ చేసైనా చలపతి, విజయవర్ధన రావుల విడు దలకు అవకాశం కల్పించవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుతూ.. శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులతో ప్రెస్ మీట్ నిర్వహించడమైనది. ఈ ప్రెస్ మీట్‌తో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకువెళ్లడంలో మీడియా సహకారాన్ని కోరుతున్నాం.
- ఆర్.భరద్వాజ
జీవిత ఖైదీల విడుదల సాధన సమితి
90528 64400