- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హైదరాబాద్‌లో భూకంపం ఎలా..?

కాలక్రమేణా భూమి లోపల ఉపరితలం పలు భాగాలుగా విడిపోతూ ఉంటుంది. వీటినే ఖగోళ శాస్త్రంలో టెక్టోనిక్ పలకలు అని అంటారు. ఈ పలకలు అప్పుడప్పుడూ కదులుతూ ఉంటాయి. దీని కారణంగా భూమిలో ఒత్తిడి పెరిగి భూకంపలు ఏర్పడతాయి. కొన్ని చోట్ల భూకం పాలు రావడానికి అగ్నిపర్వతం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే పురాతన కాలంలో ఏర్పడిన భూమి కింద ఉన్న గుహలు లేదా గనులు కాలక్రమేన కుంగిపోవడం వల్ల కూడా ఈ భూకంపాలు వస్తాయని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే కొన్ని చోట్ల భారీ ఆనకట్టలు నిర్మించడం, భూగర్భ జలాలు నిర్మిం చడం, చెట్లు నరకడం వల్ల కూడా భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. భూమి లోపలి భాగంలోని ఉష్ణోగ్రత, ఒత్తిడి మార్పులు కూడా భూకంపాలకు కారణమవుతావుతాయని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే భూమిపై జరిగే వివిధ మార్పుల కారణంగా కూడా ఈ భూమిపై ప్రకంపనలు వస్తాయి. అయితే, ఈ భూకంపం తీవ్రత 3 అంతకన్నా తక్కువ అయినపుడు అది సాధారణంగా తెలియదు. కానీ ఆ తీవ్రత 7 అంతకన్నా ఎక్కువ అయితే అది పెద్ద విస్తీర్ణములలో ప్రమాదాలకు కారణమవుతుంది.
ప్రకంపనల జోన్‌లో ఉన్నా..
తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు రాని ప్రాంతం ఏదైనా ఉందా అంటే.. వెంటనే హైదరాబాద్ అని ఎవరైనా చెబుతారు. ఎందుకంటే.. హైదరాబాద్ భూకంపాలను తట్టుకునే ప్రాంతంగా, పెద్దగా ఫలకాల కదలికలు లేని ప్రదేశంగా ఉంది. అందుకే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ జోరుగా ఉంటుంది. అందుకే భారీ ఎత్తున అపార్ట్‌మెంట్లను నిర్మిస్తుంటారు. సుమారు కోటి మందికి పైగా ఈ నగరంలో నివసిస్తున్నారంటే.. ఇది అత్యంత సేఫ్ సిటీ కావడం వల్లే.. ఐతే, ఇలాంటి సిటీలో కూడా తాజాగా భూకంప ప్రభావం కనిపించింది. చాలా చోట్ల ప్రకంపనలు వచ్చినట్లు ప్రజలు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజులు దీనిని రుజువు చేస్తున్నాయి.
నేషనల్ జాగ్రఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దేశంలో సెస్మిక్ యాక్టివిటీలను నాలుగు జోన్లుగా విభజించింది. జోన్ -2, జోన్ -3, జోన్- 4, జోన్- 5గా చేసింది. ఇందులో జోన్-5లో సంభవించే భూకంపాల తీవ్రత గరిష్ట స్థాయిలో ఉంటుంది. ప్రాణ, ఆస్తినష్టం అత్యధికంగా నమోదవుతుంటుంది. జోన్-2 సంభవించే వాటిని ప్రకంపనలుగా గుర్తిస్తుంటారు. తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా జోన్ -2 పరిధిలోకి వస్తుంది. అలాంటి తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాష్ట్రంలో ఇంతకుముందు భూకంపాలు..
ఈ భూకంపం కంటే ముందు, ఆ మధ్య వర్షాకాలంలో ములుగు, ఏటూరు నాగారం దగ్గర.. భారీ టోర్నడో వచ్చి, దాదాపు 50వేల చెట్లు నేలకొరిగాయి. ఈ టోర్నడో రావడానికి కారణం వాతావరణంలో మార్పులు వేగంగా రావడం. పైగా ములుగు ప్రాంతంలో.. సింగరేణి గనుల తవ్వకం ఎక్కువ, అక్కడి భూమిలో మెత్తదనం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు భూమిలో ఏర్ప డ్డాయి. ఇక గోదావరి జలాలు ఉన్న అన్నిచోట్లా భూకంప ప్రకంపనలు వచ్చాయి. ములుగు నుంచి దాదాపు 225 కిలోమీటర్ల వరకూ ఈ ప్రకంపనలు వచ్చాయి. తద్వారా.. గోదావరి జలాల వల్ల.. భూమిలో గట్టిదనం తగ్గిపోయి.. మెత్తగా మారడం వల్ల భూమి కదలికలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయనీ, అందుకే ఈ భూకంప ప్రకంపనలు ఇన్ని చోట్లకు రాగలిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రకృతిని కాపాడకపోతే..
గత పదేళ్లలో హైదరాబాద్ పరిసరాల్లో 5 కంటే తక్కువ తీవ్రతతో వచ్చిన భూకంపాలే అధికం. పైగా ఈ భూకంపాలన్నీ హైదరాబాద్ చుటుపక్కల వచ్చాయి తప్ప హైదరాబాద్‌లో రాలేదు. అయితే, ఇప్పుడు వచ్చిన భూకంపం తీవ్రత 5.3 ఉండటం వల్లే ఇక్కడ కొంత ప్రకంపనలు కనిపించాయి. అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందుకు మరింతగా పర్యావరణ విధ్వంసం జరగకుండా చూసుకుంటే ఇలాంటి తీవ్ర పరిస్థితులు రావని నిపుణులు సూచిస్తున్నారు. ఈసారి 5.3 తో భూకంపం వచ్చింది కాబట్టి.. భవిష్యత్తులో కూడా మళ్లీ ఇలాంటి భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకొని, వాటి తీవ్రత మరింత పెరగకుండా మనవంతుగా చెయ్యాల్సింది మనం చెయ్యాలి. ఇరు తెలుగు రాష్టాలు సాంకేతిక పరిజ్ఞానంతో నిపుణుల సలహా మేరకు భూగర్భ నీటి వనరుల వినియోగం, భవన నిర్మాణాలలో పాటించాల్సిన తక్షణ విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం కనిపిస్తోంది.
- వాడవల్లి శ్రీధర్
9989855445