తుపాన్లకు పేర్లు ఎలా పెడతారు?

by Ravi |   ( Updated:2024-05-29 00:46:01.0  )
తుపాన్లకు పేర్లు ఎలా పెడతారు?
X

తుపాన్లకు ప్రపంచ వాతావరణ సంస్థ వివిధ పేర్లను సూచిస్తోంది. ఎందుకంటే.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తుపాన్లకులు సంభవిస్తుండటంతో ఏ సంవత్సరం, ఏ నెలలో ఏ తుపాన్లకు వచ్చిందో గుర్తు పెట్టుకోవడం కోసం.. ఈ ఆలోచన 2004లో హిందూ మహాసముద్రం , బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల నుండే తుపాన్లకు ప్రభావిత 8 దేశాలకు వచ్చి ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో సమావేశమయ్యాయి. ఇంగ్లీష్ అక్షరమాల క్రమంలో ఉన్న 8 దేశాల పేర్లు పరిశీలిస్తే బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలు ఉన్నాయి. ఈ 8 దేశాలు 8 పేర్లు వంతున 64 పేర్లు 2020లో సంభవించిన అంఫాన్ తుపాన్లకు‌తో 64 పేర్లు పూర్తి అయ్యాయి.

మొత్తం 13 దేశాలు కలవడంతో..

దీంతో మరలా ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో రాబోయే తుపాన్లకు పేర్లు పెట్టడంలో ఈ 8 దేశాలతో పాటు మరో 5 దేశాలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల ప్రభావిత దేశాలతో పాటు ఉత్తర హిందూ మహాసముద్రాల పరివాహక ప్రాంతాల్లోని ఉష్ణమండల దేశాలైన ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాలు కలవడంతో మొత్తం 13 దేశాలు కలిసి రాబోయే తుపాన్లకు పేర్లు పెట్టాయి . ఒక్కొక్క దేశం 13 పేర్లు వంతున 169 పేర్లు పెట్టాయి. ఇంగ్లీష్ అక్షర మాల క్రమంలో పరిశీలిస్తే బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాలు ఎంతో అర్థవంతమైన పేర్లుపెట్టాయి. వీటిలో మొదటి దేశమైన బంగ్లాదేశ్ పెట్టిన పేరు నిసర్గతో కొత్త పేర్లు ప్రారంభమయ్యాయి.

ఇలా వరస క్రమంలో 13 దేశాలు పెట్టిన మొదటి వరస పేర్లు పూర్తి కావడంతో, మళ్లీ మొదటి దేశమైన బంగ్లాదేశ్ పెట్టిన 2 వ పేరు అయిన బిఫర్ జాయ్‌తో వరుస క్రమంలో 5వ దేశమైన మయన్మార్ సూచించిన మిచాంగ్ పేరును 2023 డిసెంబర్ నెలలో సంభవించిన తుపాన్లకు కు పేరు పెట్టడంతో, రెండో వరుసలో ఉన్న 5 పేర్లు పూర్తి అయ్యాయి. మొదటి దేశమైన బంగ్లాదేశ్ సూచించిన నిసర్గ నుండి ఒమన్ సూచించిన మోచా వరకు మొదటి వరస పేర్లను ఇప్పటికే వాతావరణ సంస్థ ఉపయోగించింది. దీంతో 13 దేశాలు సూచించిన మొదటి వరుసలో ఉన్న 13 పేర్లు పూర్తి అయ్యాయి. తరువాత రెండవ వరస క్రమంలో ఇంగ్లీషు వర్ణమాల ప్రకారం ఇప్పటివరకు 5వ దేశమైన మయన్మార్ సూచించిన మిచాంగ్ పేరును 2023 డిసెంబర్‌లో సంభవించిన పేరును పెట్టారు. ఇక మొన్న ఈ మధ్య మే నెలలో సంభవించిన తుపాన్లకు‌కు 6వ దేశమైన ఒమన్ సూచించిన రిమల్ పేరును సూచించారు.

-సి.ఎన్. మూర్తి

8328143489

Advertisement

Next Story