- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యూపీఎస్‌తో జీవన భద్రత కరువే!

కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్ స్థానంలో యూపీ ఎస్‌ను ప్రవేశపెడుతూ జనవరి 25 తేదీన గెజిట్ విడుదల చేసింది. దీని ప్రకారం కేంద్ర ఉద్యోగులు ఆప్షనల్‌గా ఎన్‌పీఎస్ లేదా యూ పీఎస్‌ను ఎన్నుకోవలసి ఉంటుంది. ఇది ఏప్రి ల్ ఒకటి నుండి అమలులోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆప్షనల్‌గా అమలుపరచుకోవచ్చు. అయితే ఇదిఎటువంటి వేతన తగ్గిం పులు లేని పింఛను హక్కును ఇది కాలరాస్తూ ఉన్నట్లు అంచనా వేయాల్సి ఉంటుంది.
కాంట్రిబ్యూషన్ ఉద్యోగి నచ్చిన పథకాలలో పొదుపు చేసుకునే స్వేచ్ఛ లేకపోవడం, పదవీ విరమణ నాడు దాచుకున్న మొత్తాలు, చెల్లింపులపై స్పష్టత లేకపోవడం యూపీఎస్ లోపం. దీంతో 28.5% వేతనం భాగం సందిగ్ధంగా గాలిలో దీపంలాగా మారనుంది. దీన్ని షేర్ మార్కెట్లో పొదుపు చేస్తే పింఛను చెల్లింపులపై ప్రభావం చూపుతుంది. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ, సర్వీస్ గ్రాట్యుటీ లెక్కింపు విధానంపై యూపీఎస్‌లో స్పష్టత రావాల్సి ఉంది. యూపీఎస్‌లో ఓపీఎస్ పెన్షన్ తగ్గింపు లేకుండా చెల్లించే ఎన్‌హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్‌కు తిలోదకాలు ఇవ్వడం జరిగిందంటున్నారు.
యూపీఎస్‌పై తాజా గెజిట్
25 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రాల అభీష్టం మేరకు 90 లక్షల మంది లబ్ధి పొందేటట్లు చట్టాన్ని రూపొందించారు. కొత్త పింఛను పథకంపై వ్యతిరేకతను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఎన్‌పీఎస్‌ని సమీక్షించేందుకు కేంద్ర ఆర్థిక కార్యదర్శి ఆధ్వర్యంలో గత 2023లో కమిటీని నియమించింది. కేంద్ర ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యూపీఎస్)పై పలు సిఫారసులు చేసింది. వీటిని ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ 2024 ఆగస్టు 24న నిర్ణయం తెలియపరిచింది. దీనికి చట్టరూపాన్నిస్తూ 2025 జనవరి 25 నాడు కేంద్ర గెజిట్ విడుదలైంది.
గెజిట్‌లోని ముఖ్యాంశాలు
సర్వీస్ 25 ఏళ్లకే పూర్తి పింఛన్లు మంజూరు చేస్తారు. కనీస సర్వీస్ పదేళ్లు ఉంటేనే యూపీఎస్ మంజూరు అవుతుంది. ఉద్యోగులకు కనీస పింఛను 10,000 నుంచి ప్రారంభమవుతుంది. 12 నెలల చివరి మూల వేతన సగటును పింఛను లెక్కింపుకు మూలంగా తీసుకుంటారు. ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబం పింఛను 60 శాతం చెల్లిస్తారు. ప్రతి నెల వేతనంలో 10 శాతం మినహాయింపుగా యూపీఎస్‌కు చెల్లించాలి. దీనికి జతగా కేంద్ర ప్రభుత్వం 18.5% మ్యాచింగ్ అమౌంట్ చెల్లిస్తుంది. కుటుంబం పింఛ నుకు కరువు భత్యం చెల్లిస్తారు. సేవ చేస్తున్న ఉద్యోగులకు వర్తించే డియర్‌నెస్ అలవెన్స్ మాదిరిగానే డియర్‌నెస్ రిలీఫ్ పని చేస్తుంది. అయితే చెల్లింపు ప్రారంభమైనప్పుడు మాత్రమే డియర్‌నెస్ రిలీఫ్ చెల్లించబడుతుంది. 25 సంవత్సరాల కనీస అర్హత సర్వీస్ వ్యవధి తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసినట్లయితే, అటువంటి ఉద్యోగి పదవీ విరమణ చేసిన తేదీ నుండి పింఛన్లతో పాటు అర్హత గల మించిన ఆర్థిక లాభాలు చెల్లించబడతాయి. ఉద్యోగి రాజీనామా, డిస్మిస్ అయిన సందర్భంలో ఏకీకృత పెన్షన్ స్కీం వర్తించదు. తక్కువ అర్హత కలిగిన సర్వీస్ ఉన్నప్పుడు దామాషా ప్రకారం పింఛను చెల్లింపు అనుమతించబడుతుంది. ఒక వేళ విరమణ తర్వాత పింఛనుదారుడు మరణించిన సందర్భంలో, అతని మరణానికి ముందు, చెల్లింపుదారునికి అనుమతించబడే చెల్లింపులో 60% కుటుంబ పింఛను ఇస్తారు. అతని మరణానికి ముందు, చట్ట బద్ధంగా వివాహం చేసుకున్న జీవిత భాగస్వామికి వర్తిస్తుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలు తేదీకి ముందు పదవీ విరమణ చేసిన ఏకీకృత పెన్షన్ స్కీం ఎంపికను ఎంచుకున్న ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ టాప్-అప్ మొత్తాన్ని అందుబాటులో ఉంచే విధానాన్ని నిర్ణయిస్తుంది.
ఉద్యోగుల అభ్యంతరాలు..
ఓపీఎస్‌లో చివరి మూల వేతనాన్ని ఆధారంగా పింఛను లెక్కిస్తారు. కానీ యూపీఎస్‌లో 12 నెలల మూల వేతన సగటును పింఛనుగా నిర్ణయిస్తారని తెలపడం వల్ల కొంతమేర పింఛను తగ్గే అవకాశం ఉంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీముగానే యూపీఎస్ కొనసాగుతుందని కేంద్రం గెజిట్‌లో స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఉద్యోగుల జీవన భద్రతకు భంగం కలిగించే అవకాశం ఉంది. నిర్ణయించబడే పింఛనుకు కరువు భత్యం మాత్రమే వర్తింపజేస్తూ పీఆర్సీ వర్తింప చేయకపోవడం వల్ల భవిష్యత్తులో మూల పింఛను పెరిగే అవకాశం లేదు. దీంతో ధరల పెరుగుదలకు అనుగుణంగా పింఛను పెరుగుదల ఉండదు. ఇది జీపీఎస్ కంటే కొంత మెరుగుగా ఉన్నట్లు తెలుస్తున్నది. పాత పింఛను విధానంతో పోలిస్తే కమ్యూటేకేషన్‌కు స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తున్నది. గ్రాట్యుటీ పోలిన పింఛను ఆర్థిక లాభాన్ని మాత్రమే వర్తింపజేశారు. మిగిలిన కమ్యూటేకేషన్, పీఆర్సీల ద్వారా పొందే వ్యత్యాసాలను కనపరచక పోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
ఎటువంటి వేతన తగ్గింపులు లేని పింఛను హక్కును ఇది కాలరాస్తూ ఉన్నట్లు అంచనా వేయాల్సి ఉంటుంది. మొత్తం కాంట్రిబ్యూషన్ ఉద్యోగి నచ్చిన పథకాలలో పొదుపు చేసుకునే స్వేచ్ఛ లేకపోవడం, పదవీ విరమణ నాడు దాచుకున్న మొత్తాలు చెల్లింపులపై స్పష్టత లేకపోవడం యూపీఎస్‌లో లోపం. దీంతో 28.5% వేతనం భాగం సందిగ్ధంగా గాలిలో దీపం లాగా మారనుంది. దీన్ని షేర్ మార్కెట్లో పొదుపు చేస్తే పింఛను చెల్లింపులపై ప్రభావం చూపుతుంది. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ కం రిటైర్మెంట్ గ్రాట్యుటీ , సర్వీసు గ్రాట్యుటీ లెక్కింపు విధానంపై యూపీఎస్‌లో స్పష్టత రావాల్సి ఉంది. యూపీఎస్‌లో ఓపీఎస్ పెన్షన్ తగ్గింపు లేకుండా చెల్లించే ఎన్‌హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్‌కు తిలోదకాలు ఇవ్వడం జరిగిందంటున్నారు.
సమస్య పరిష్కారం కావాలంటే..
రాష్ట్రంలో గత ప్రభుత్వం జీపీఎస్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అసెంబ్లీ తీర్మానాలు, యాక్ట్‌లు, ఉత్తర్వులు వెలువడ్డాయి. 21 అక్టోబర్ 2023 నుండి ఇది ఉద్యోగులకు వర్తించేలా జీవో 54 విడుదలైంది. ఇంత జరుగుతూ ఉండగానే ప్రభుత్వం మారిపోయింది. సీపీఎస్ రద్దు పై ఆశలు చిగురించే విధంగా అడుగులు వేయాల్సిన కొత్త ప్రభుత్వం జీపీఎస్ అమలు తేదీని నోటిఫై చేస్తూ పాత గెజిట్ విడుదల చేయడం వివాదస్పదంగా మారింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ జీపీఎస్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. తదుపరి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీం కూడా జీపీఎస్‌ను పోలి ఉన్నందున ఉద్యోగులు ఎవరూ ఒప్పుకోవడం లేదు. కావున ఓపీఎస్‌ను పోలి ఉన్న సేఫ్ పెన్షన్ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సింది. కాంట్రిబ్యూషన్ లేకుండా కనీసం గ్రాట్యుటీ సౌకర్యంతో పదవీ విరమణ నాడు మూలం వేతనంలో సగం పింఛనుగా చెల్లించి తదుపరి పీఆర్సీ, కరువు భత్యాలు అనువర్తించే విధంగా ప్రకటించినప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. సీపీఎస్, జీపీఎస్ యూపీఎస్‌లకు ప్రత్యామ్నాయంగా ఓపీఎస్‌ను పోలిన ఎస్‌పీఎస్ (సేఫ్ పెన్షన్ స్కీం) అనుభవంలోకి తెచ్చినప్పుడే సీపీఎస్ రద్దు సమస్య పరిష్కరించబడుతుంది. లేకుంటే నిరసన జ్వాల ఆగదు.
- సి.వి. ప్రసాద్
రాష్ట్ర అధ్యక్షులు,
ఏపీటీఎఫ్, అమరావతి
90590 76177