అపరిశుభ్రమైన టాయిలెట్లు ఎంత అనారోగ్యకరమో తెలుసా?

by Ravi |   ( Updated:2025-04-23 00:30:55.0  )
అపరిశుభ్రమైన టాయిలెట్లు ఎంత అనారోగ్యకరమో తెలుసా?
X

ఏ బస్టాండు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. దశాబ్దాలుగా చూస్తున్నా మన దేశ నగరాలు, పట్టణాల్లోని పబ్లిక్ టాయిలెట్లు అశుభ్రతకు, దుర్గంధానికి మారుపేర్లు గానే నిలుస్తున్నాయి. దేశంలోనే అతిపెద్దది గా పేరున్న హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ పరిస్థితి ఇంతే! ఏదో ఆరోపణలు వచ్చినప్పుడు, మీడియాలో రిపోర్టు వచ్చినప్పుడు తాత్కాలికంగా టాయ్‌లెట్లను అలా శుభ్రం చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రకటనలు విడుదల చేస్తారు తప్పితే కొన్నాళ్ల తర్వాత పరిస్థితి షరా మామూలే అవుతోంది. 40 ఏండ్లుగా పబ్లిక్ టాయిలెట్ల శుభ్రత విషయంలో ఎలాంటి మార్పు లేకుండా ఉండటం విషాదకరం. ఈ టాయిలెట్ల అశుభ్రత వలన మహిళలు, ముఖ్యంగా గర్భిణీలు, ఇతర శ్రామిక స్త్రీలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రయాణ సమ యంలో ఈ అశుభ్రతతో కూడిన టాయిలెట్లను ఉపయోగించాలంటే కూడా భయపడుతున్నారు. ఇలాంటి అపరిశుభ్రమైన టాయిలెట్ల వలన చర్మ సంక్రమణలు, శ్వాసకోశ వ్యాధులు, సాంక్రమిక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఇది కాకుండా, బస్టాండ్‌లో పనిచేసే మహిళా విక్రేతలు కూడా వీటివల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. అందుకే పబ్లిక్ టాయిలెట్లలో ప్రాథమిక శుభ్రత కూడా లేకపోవడం ఒక అత్యవసరమైన సమస్యగా మారింది, దీనికి పరిష్కారం త్వరగా అవసరం. బస్టాండ్‌లో టాయిలెట్లకు ఆనుకొని తాగే నీరు ఉండటంతో అవి తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు.. ఇది ప్రయాణం సమయంలో శారీరక, మానసిక కష్టాలు కలిగిస్తుంది. బస్టాండ్లలో టాయిలెట్ల శుభ్రతను, సంతృప్తికరమైన హైజీన్ ప్రమాణాలను సాధించడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. పౌర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ చర్యలు చాలా అవసరం అవుతాయి.

బత్తుల కిరణ్ కుమార్ రాజు

93816 483567



Next Story

Most Viewed