జగన్ పాలన పై ప్రజల అంతరంగమేమిటి?

by Ravi |   ( Updated:2022-12-31 18:46:08.0  )
జగన్ పాలన పై ప్రజల అంతరంగమేమిటి?
X

జగన్ వస్తే ఏదో చేస్తాడన్న తమ ఆశలు ఆవిరి అయ్యాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన జగన్ పరిపాలనపై మూడున్నరేళ్ళు భ్రమలు తొలగిపోయాయి. మూడున్నరేళ్లుగా నిరంకుశ, నిర్బంధ, ఫాసిస్టు పాలన సాగించి ప్రజలకు వర్తమానమే కాదు, భవిష్యత్ కూడా ఆగమ్యగోచరంగా మార్చారు. అందుకే, గడప గడపకి వస్తున్న వైసీపీ నాయకులను చూడగానే ప్రజలు ఆగ్రహంతో నిలదీస్తున్నారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి సభ పెడితే జనాల కోసం అక్కడి పాఠశాలలను మూసివేయించి ఆ పాఠశాల బస్సులలో, ఆర్టీసీ బస్సులలో ప్రజల సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బలవంతంగా జనసమీకరణ చేస్తున్నారు. చంద్రబాబు సభలు పెడితే ప్రజలు స్వచ్ఛందంగా సొంత వాహనాలలో తరలివస్తున్నారు.

గన్ మూడున్నరేళ్ల పాలనలో విఫలమయ్యారు. విషం, విధ్వంసం, విద్వేషం తప్ప మరే అభివృద్ధి లేదని తేలిపోయింది. ఆయన చేతిలో రాష్ట్రం అధోగతి పాలయ్యింది. అందుకే తమ భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలి'అని ప్రజలు భావిస్తున్నారు. జగన్ అబద్ధాలు మాటలు, హామీలు నమ్మి భారీ మెజారిటీతో గెలిపించి అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని, జగన్ కు పరిపాలన చేతకాదని అందుకే ఈ సారి రాష్ట్ర ప్రజలు అనుభవం, సమర్థత ఉన్న నాయకుడికి అధికారం ఇవ్వాలనుకుంటున్నారు.

జగన్ వైఖరితోనే

వైఎస్ఆర్‌సీపీ(ysrcp) అధికారంలోకి వచ్చిన సమయం నుంచి 10 రూపాయలు చేతిలో పెట్టి 100 రూపాయలు వసూలు చేసే ప్రక్రియకు తెరలేపారు. పన్నులు, చార్జీలు పెంచారు. అప్పులను 8 లక్షల కోట్లకు చేర్చి రాష్ట్ర పరిస్థితిని అధోగతి పాలు చేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని అటకెక్కించి రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా, కులాల వారీగా విడగొడుతూ రాజకీయం చేస్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని భూములు, ఖనిజ సంపద స్వాహా చేస్తున్నారు. సలహాదారుల పేరుతో, ప్రకటనల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన అనుయాయులకు దోచి పెడుతున్నారు.

సామాజిక న్యాయం పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసి అన్ని పదవులను తన సామాజికవర్గం వారికే ఇచ్చారు. రివర్స్ టెండరింగ్ పేరుతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించి, పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చారు. కొత్త పరిశ్రమలు తేకపోగా వచ్చిన పరిశ్రమలను వెళ్లగొట్టి యువతను మోసం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, గంజాయి, మత్తు పదార్థాల మాఫియా చెలరేగిపోయింది. ప్రభుత్వంపై వ్యతిరేకత పతాక స్థాయికి చేరిందని చెప్పడానికి చంద్రబాబు సభలకు పోటెత్తుతున్న జనమే నిదర్శనం. ఎన్‌టీఆర్(ntr) నిర్వహించిన బహిరంగ సభలు గుర్తువస్తున్నాయి. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి వేసిన పునాదులు అన్ని కూల్చివేశారని ప్రజలు విశ్వసిస్తున్నారు. పోలవరంను పాడు పెట్టారు. భవిష్యత్ తరాలకు పోగేసిన సంపదను మూడు ముక్కలు చేసి నిర్వీర్యం చేస్తున్నారు.

వారిని నిలదీస్తూ

జగన్ వస్తే ఏదో చేస్తాడన్న తమ ఆశలు ఆవిరి అయ్యాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన జగన్ పరిపాలనపై మూడున్నరేళ్ల భ్రమలు తొలగిపోయాయి. మూడున్నరేళ్లుగా నిరంకుశ, నిర్బంధ, ఫాసిస్టు పాలన సాగించి ప్రజలకు వర్తమానమే కాదు, భవిష్యత్ కూడా ఆగమ్యగోచరంగా మార్చారు. అందుకే, గడప గడపకి వస్తున్న వైసీపీ నాయకులను(ysrcp leaders) చూడగానే ప్రజలు ఆగ్రహంతో నిలదీస్తున్నారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి సభ పెడితే జనాల కోసం అక్కడి పాఠశాలలను మూసివేయించి ఆ పాఠశాల బస్సులలో, ఆర్టీసీ బస్సులలో ప్రజల సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బలవంతంగా జనసమీకరణ చేస్తున్నారు.

చంద్రబాబు(tdp chief) సభలు పెడితే ప్రజలు స్వచ్ఛందంగా సొంత వాహనాలలో తరలివస్తున్నారు. ఆయన రాక కోసం అర్థరాత్రి అయినా ప్రజలు ఎదురుచూస్తున్నారు. సభలకు వెళ్ళవద్దని వైసీపీ నాయకులు, వాలంటీర్లు ఎంత బెదిరించిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. దీనిని బట్టి రాష్ట్రంలో జగన్, చంద్రబాబు పట్ల ప్రజల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

నీరుకొండ ప్రసాద్

9849625610

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed