ఎడ్‌సెట్ ఫలితాలు రేపు విడుదల

by Shyam |
ఎడ్‌సెట్ ఫలితాలు రేపు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఈడీ రెండేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్​‌సెట్​ ఫలితాలను ఈనెల 28న విడుదల చేయనున్నట్టు కన్వీనర్​ మృణాళిని తెలిపారు. ఎడ్​‌సెట్​ పరీక్షలను ఈ నెల 1,3 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా.. 30,600 మంది హాజరయ్యారు.

నవంబర్​ 6న లాసెట్​ ఫలితాలు

టీఎస్​ లాసెట్​ ఫలితాలను నవంబర్​ 6న విడుదల చేయనున్నట్టు కన్వీనర్​ జీబీ రెడ్డి తెలిపారు. ఎల్​ఎల్​బీ, ఎల్ఎల్​ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 9న ఎంట్రన్స్​ పరీక్ష నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 68కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 21,559 మంది హాజరయ్యారు.

Advertisement

Next Story