- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రియాను విచారించిన ఈడీ
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటి రియా చక్రవర్తి మనీలాండరింగ్ కేసులో భాగంగా ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు. అయితే తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉందని.. తన విచారణను వాయిదా వేయాలని ఆమె ఈడీని కోరింది. కానీ, అందుకు ఈడీ అంగీకరించలేదు. దీంతో ఆమె ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హజరైంది.
మరో వైపు బీహార్ సర్కార్ సుశాంత్ కేసును మహారాష్ట్ర పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని.. రియాకు సహకరిస్తున్నారని సుప్రీంకోర్టుకు తెలిపింది. కాగా, సుశాంత్ కుటుంబ సభ్యులు రియాపై బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె సుశాంత్ బ్యాంకు అకౌంట్ నుంచి కోట్లలో డబ్బులు డ్రా చేసిందని వారు ఫిర్యాదులో పేర్కొనడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగానే శుక్రవారం రియాను విచారించింది.
Next Story