మెహుల్ చోక్సీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

by Harish |
మెహుల్ చోక్సీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)ను మోసం చేసిన కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గీతాంజలి గ్రూప్ డైరెక్టర్ మెహుల్ చోక్సీకి చెందిన రూ. 4.45 కోట్ల ఆస్తులను జతచేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులలో ముంబైలోని 1,460 చ.అ ప్లాట్‌తో పాటు బంగారం, ప్లాటినం ఆభరణాలు, వజ్రాలు, విలువైన వస్తువులు, గీతాంజలి గ్రూప్, మెహుల్ చోక్సీ పేరిట రిజిస్టర్ చేయబడిన మెర్సిడెస్ బెంజ్ కార్లు ఉన్నట్టు తెలుస్తోంది. మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీతో కలిసి పీఎన్‌బీని రూ. 13 వేల కోట్లు మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఈడీ ఈ కేసులో భాగంగా రూ. 2,550 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది.

Advertisement

Next Story